ETV Bharat / bharat

కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

spurious liquor
కల్తీ మద్యం
author img

By

Published : May 12, 2021, 1:08 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ అంబేడ్కర్ నగర జిల్లాలో కల్తీ మద్యం తాగి.. ఐదుగురు మరణించారు. మరో నలుగురు అస్వసస్థతకు గురయ్యారు. జైత్​పుర్​ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులంతా మఖ్​దూంపుర్, శివపాల్ గ్రామాలకు చెందినవారుగా అధికారులు తెలిపారు.

"అజమ్​గఢ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో తయారైన కల్తీ మద్యాన్ని శివపాల్​ గ్రామానికి చెందిన సోను కొనుగోలు చేశాడు. దీనిని అతని కుటుంబానికి చెందిన 12 మంది సేవించారు. దీంతో అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు చనిపోగా.. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది" అని అధికారులు తెలిపారు. కల్తీ మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ఉత్తరాఖండ్​లో ఆకస్మిక వరదలు... అమిత్​ షా ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.