తమిళనాడులోని దిండిక్కల్ జిల్లా సెంబట్టి సమీపంలోని ఆత్తూరు డ్యామ్‌లో మునిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. ఆదివారం జలాశయంలో వీరు స్నానం చేస్తుండగా ఒకరు నీట మునిగారు. అతన్ని కాపాడే ప్రయత్నంలో మిగిలిన నలుగురు కూడా మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మృతులంతా దిండిక్కల్ భారతి పురానికి చెందినవారు. వీరిలో నాగరాజన్ (19), లోకనాథన్ (19), సెల్వభరణి (19) దిండిక్కల్లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం రెండవ సంవత్సరం చదువుతున్నారు. భరత్ (16) పదో తరగతి చదువుతుండగా, కార్తీక్ ప్రభాకరన్ (19) ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవదహనం