ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో (zika virus in india) తొలి జికా కేసు నమోదైంది. వాయుసేనలో పనిచేసే అధికారికి వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న వాయుసేన అధికారి కాన్పూర్‌లోని వాయుసేన ఆస్పత్రిలో చేరినట్లు చెప్పారు. ఆయన రక్త నమూనాలను పుణెలోని లాబొరేటరీకి పంపించగా జికా వైరస్ (zika virus in india) సోకినట్లు నిర్ధరణ అయినట్లు అధికారులు వివరించారు. బాధితుడిని కలిసిన మరో 22మందికి కూడా వైరస్ లక్షణాలే ఉండటం వల్ల వారి రక్త నమూనాలను కూడా లాబొరేటరీకి పంపినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖతోపాటు స్థానిక సంస్థల అధికారులను అప్రమత్తం చేశారు. జికా వైరస్ వ్యాప్తి (zika virus in india) చెందకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : భారీ కొండచిలువను పట్టి.. తాడుతో కట్టేసి..