కంబళ పరుగు పోటీలకు ఉన్న ప్రత్యేకత అంతాఇంతా కాదు. అయితే.. దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని పక్కనపెట్టి తొలిసారి ఈ ఏడాది జరిగే పోటీల్లో యువతులు పాల్గొననున్నారు. దక్షిణ కర్ణాటకలోని తుళునాడులో ఈ ఏడాది నిర్వహించే కంబళ పోటీల్లో ఐదుగురు అమ్మాయిలు బరిలోకి దిగుతున్నారు.
ఈ ఏడాది కంబళ పోటీల్లో పాల్గొనేందుకు తమ తమ కూమార్తెలను ప్రోత్సహిస్తున్నామని కుటుంబసభ్యులు తెలిపారు.
గతేడాది.. కుందాపురక్కు చెందిన ఛైత్ర పరమేశ్వర్ భట్ తొలిసారిగా కంబళ పోటీల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. అయితే ఈ ఏడాది ఛైత్రతో పాటు మరో నలుగురు యువతులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుతం వీరు శిక్షణలో ఉన్నారు.
ఏమిటీ కంబళ?
కంబళ అనేది ప్రధానంగా కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయబద్ధమైన పరుగు పోటీ. బురద మళ్లలో పోటీదారులు తమ దున్నలతో కలిసి వేగంగా పరుగెత్తాల్సి ఉంటుంది. నగదు బహుమతి రూ.లక్షల్లో ఉంటుంది. వేగంగా పరుగెత్తించేందుకుగాను దున్నలను పోటీదారులు కొరడాతో బలంగా కొడుతూ వాటిని వెంబడిస్తుంటారు.
ఇదీ చదవండి: తుపాకీతో బెదిరించి.. బ్యాంకును దోచేసి..