ETV Bharat / bharat

కొవిడ్ నిబంధనల మధ్య తొలి దశ పోలింగ్ - బంగాల్ తొలి దశ పోలింగ్

బంగాల్​, అసోంలో తొలి విడత పోలింగ్​ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు కడుతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ.

first phase polling started in assam and WB
అసెంబ్లీ పోల్స్: బంగాల్​, అసోంలో తొలి దశ పోలింగ్ ప్రారంభం
author img

By

Published : Mar 27, 2021, 7:50 AM IST

బంగాల్‌లో 30 స్థానాలకు తొలివిడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో 191 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. హ్యాట్రిక్‌ విజయం కోసం తృణమూల్‌ కాంగ్రెస్‌, బంగాల్‌లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలన్న పట్టుదలతో భాజపా హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహించాయి. తొలి విడత కోసం 10,288 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం.. భారీగా బలగాలను మోహరించింది.

first phase polling started in assam and WB
పోలింగ్​కు తగిన ఏర్పాట్లు చేసిన సిబ్బంది

ఓటు హక్కును వినియోగించుకుంటున్న మహిళ

అసోంలో 47 శాసనసభ స్థానాలకు తొలి విడత పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ విడతలో సీఎం సోనోవాల్‌ సహా పలువురు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడు వంటి బడానేతలు పోటీలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఈసీ.. కొవిడ్‌ నిబంధనల మధ్య ఓటింగ్‌ జరిపేందుకు చర్యలు చేపట్టింది.

పోలింగ్​ కేంద్రాల వద్ద ఓటర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.