అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గురువారం నాటికి మందిరం తొలి దశ నిర్మాణం పూర్తయినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్(Ram Janmabhoomi) తెలిపింది. ఈ దశ నిర్మాణం విజయవంతంగా పూర్తవడంపై హర్షం వ్యక్తం చేసింది.

ఈ మేరకు మందిర(Ram Mandir) నిర్మాణ పనులు పరిశీలించేందుకు వెళ్లారు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. 12 గంటల నుంచి వర్షం ఎడతెరపిలేకుండా కురుస్తుండటం వల్ల కొద్ది మందే ఈ మందిర ప్రాంతానికి వచ్చారు.

"రెండో దశ నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తి చేస్తాం. కర్ణాటక గ్రానైట్, మిర్జాపుర్ సాండ్స్టోన్తో లేయర్ వేయడం ప్రారంభించనున్నాం. ఆ తర్వాత మూడు నాలుగు నెలల వ్యవధిలో మరో దశ పూర్తి కానుంది. "
-చంపత్ రాయ్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి.
రామమందిర(Ayodhya Ram Mandir) నిర్మాణ కమిటీ తుది నిర్ణయం ప్రకారం.. అయోధ్యలోని ఈ ఆలయ ప్రాంగణంలో ఆరు మందిరాలను కట్టనున్నారు. ఆలయ ఫౌండేషన్ అక్టోబర్ చివరికల్లా లేదా నవంబర్ మొదటి వారం కల్లా పూర్తవుతుందని రామమందిర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు.

మరో రెండేళ్లలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని 5మండపాలు, గర్భగుడి పనులు పూర్తవుతాయని, 2023 డిసెంబరు నాటికి భక్తుల దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయట్రస్ట్ వర్గాలు ఇటీవలే తెలిపాయి.
ఇదీ చదవండి: