అసోం అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 72.14శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన జనం.. కరోనా నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 47 స్థానాల్లో బరిలో నిలిచిన 264 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించగా.. వాటిని మార్చారు అధికారులు.
![first phase of polling in Assam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11180362_assam3-2554.jpg)
![first phase of polling in Assam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11180362_assam3-222.jpg)
మొత్తం 47 స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. 9 గంటల వరకు 14.28 శాతం నమోదైంది. ఆ తర్వాత ఓటర్లు తరలిరావటం వల్ల.. ఓటింగ్ శాతం క్రమంగా పుంజుకుంది.
![first phase of polling in Assam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11180362_assam-2.jpg)
![first phase of polling in Assam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11180362_assam3-232233.jpg)
ప్రముఖులు..
అసోం సీఎం సోనోవాల్ మజులీ స్థానం నుంచి ఈ దఫా ఎన్నికల్లో నిలిచారు. శాసనసభ సభాపతి హితేంద్రనాథ్ గోస్వామి జోరాట్ నుంచి, పీసీసీ అధ్యక్షుడు రిపున్ బోరా గోపూర్ నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచారు
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు వీరే..
![first phase of polling in Assam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11180362_assam2.jpg)
![first phase of polling in Assam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11180362_assam1.jpg)
![first phase of polling in Assam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11180362_assam3.jpg)
![first phase of polling in Assam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11180362_assam4.jpg)