ETV Bharat / bharat

ఈ ఏడాది జూన్​ నుంచి జన గణన!

జన గణన ప్రక్రియను ఈ ఏడాది జూన్​లో ప్రారంభించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఎన్​పీఆర్​లో తాజా వివరాలను పొందుపర్చనున్నట్లు సమాచారం.

First phase of census
ఈ ఏడాది జూన్​ నుంచి జన గణన!
author img

By

Published : Feb 26, 2021, 5:41 AM IST

కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడ్డ జన గణన ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బృహత్తర ప్రక్రియను జూన్​లో ప్రారంభించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు. అదే సమయంలో జాతీయ జనాభా పట్టిక (ఎన్​పీఆర్​)లో తాజా వివరాలను పొందుపర్చనున్నట్లు చెప్పారు.

కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బందితో పాటు వృద్ధులకు (మొత్తంగా దాదాపు 30 కోట్ల మందికి) టీకా అందించాల్సి ఉండటం వల్ల జనగణన ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవని తొలుత విశ్లేషణలు వెలువడ్డాయి.వ్యాక్సినేషన్​ జూన్​కు ముందే పూర్తవుతుందని తాము అంచనా వేస్తున్నట్లు అధికారి చెప్పారు. ఆలోపు నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఈ దఫా జనాభా లెక్కలను డిజిటల్​ విధానంలో చేపట్టనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.