అయోధ్య రామ మందిరం సముదాయం మరింత విశాలంగా ఉండాలన్న ఉద్దేశంతో అదనంగా 7 వేల 285 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేసింది రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. ప్రస్తుతమున్న ఆలయ కాంప్లెక్స్‌ను 70 ఎకరాల నుంచి 107 ఎకరాలకు పొడిగించాలన్న ప్రణాళిక మేరకు ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ట్రస్ట్ అధికారులు పేర్కొన్నారు.
ఆ భూమి యజమాని దీప్ నారాయణ్‌కు చదరపు అడుగుకు రూ. 1373 చొప్పున చెల్లించి.. మొత్తం కోటి రూపాయలు వెచ్చించినట్లు స్పష్టం చేశారు. హిందువుల ఆరాధ్య దైవమైన రాముని కోసం రామ మందిర నిర్మాణాన్ని ట్రస్ట్ తలపెట్టింది.
ఇదీ చూడండి: భూకంపం వచ్చినా అయోధ్యలో మందిరం చెక్కుచెదరదు!
ఇతర స్థలాల కొనుగోలుపై..
మరింత భూమిని కొనుగోలు చేసే ఆలోచనతో ఉన్న ట్రస్ట్.. రామాలయం కాంప్లెక్స్‌కు పక్కనే ఉన్న ఆలయాలు, నివాసితులు, ఖాళీ స్థలాల యజమానులతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 107 ఎకరాల ఆలయ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇంకా 14 లక్షల 30 వేల 195 చ. అ. భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఐదెకరాల్లో ఆలయం నిర్మించనుండగా.. మిగతా భూమిని మ్యూజియం, లైబ్రరీ సహా ఇతర సౌకర్యాల కోసం వినియోగించనున్నారు.
ఇదీ చూడండి: మలయాళంలో కుడి నుంచి ఎడమకు రాసి రికార్డ్