మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఓ రోగిలో బ్లాక్, వైట్ ఫంగస్‌లను వైద్యులు గుర్తించారు. దేశంలో ఇలాంటి కేసు నమోదవటం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.
భోపాల్‌లో మరో కేసు నమోదైంది. ఓ రోగిలో బ్లాక్, వైట్ ఫంగస్ నిర్ధరణ అయింది.
ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్లాక్‌ఫంగస్ పంజా విసురుతోంది. మరి కొన్ని రాష్ట్రాల్లో వైట్‌ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఇలాంటి కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది.