ETV Bharat / bharat

కొవిడ్ సంరక్షణ కేంద్రంలో మంటలు- 18 మంది మృతి

గుజరాత్​లోని ఓ కొవిడ్ సంరక్షణ కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Fire
మంటలు
author img

By

Published : May 1, 2021, 5:58 AM IST

Updated : May 1, 2021, 10:31 AM IST

గుజరాత్‌లో విషాదం జరిగింది. భరూచ్‌లోని ఓ కొవిడ్‌ సంరక్షణ కేంద్రంలో అగ్నిప్రమాదం.. 18 మందిని బలితీసుకుంది. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఇద్దరు నర్సులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పటేల్‌ వెల్ఫేర్‌ కొవిడ్‌ సంరక్షణ కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

Fires at covid care center kill -12 people
కొవిడ్ సంరక్షణ కేంద్రంలో అగ్ని ప్రమాదం

కొవిడ్ సంరక్షణ కేంద్రంలో మంటలు

శుక్రవారం అర్ధరాత్రి తర్వాత సంభవించిన ఈ ఘటనలో.. ప్రమాద స్థలిలోనే 12మంది మృత్యువాత పడగా, మరో ఆరుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆస్పత్రిలో 4 అంతస్తులు ఉండగా, కింది అంతస్తులో ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్ధానికులు మరో 50 మంది వరకు కరోనా రోగులను రక్షించారు.

కొవిడ్ సంరక్షణ కేంద్రంలో మంటలు-12మంది మృతి

బాధితులకు కావాల్సిన అన్ని వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన కొవిడ్‌ సంరక్షణ కేంద్రం, ఓ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

మోదీ సంతాపం..

ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన ఎంతో బాధించిందని పేర్కొన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ సైతం ప్రమాద ఘటన తనను ఉద్వేగానికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియోను అందించనున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి: నేటి నుంచే '18ప్లస్'​కు టీకా... కొన్ని రాష్ట్రాల్లోనే!

Last Updated : May 1, 2021, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.