విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో స్వల్పస్థాయి అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం.. నౌకలో మంటలు చెలరేగాయని భారత నౌకాదళ ప్రతినిధి వెల్లడించారు. వెంటనే అప్రమత్తమై.. మంటలను ఆర్పేసినట్లు చెప్పారు. నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేశారు. ఘటన జరిగిన సమయంలో ఈ నౌక.. కర్ణాటక కర్వార్ హార్బర్లో ఉందని చెప్పారు.
"నౌకలోని ఓ భాగం నుంచి పొగ వెలువడటాన్ని సిబ్బంది గుర్తించారు. ఆ సమయంలో సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను ఆర్పేశారు. భారీ నష్టమేమీ జరగలేదు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాం."
-నౌకాదళ ప్రతినిధి
ఈ విమానవాహక నౌకను 2013లో రష్యా నుంచి కొనుగోలు చేసింది భారత్. దేశ చరిత్రలో గొప్ప పాలకుడిగా భావించే చక్రవర్తి విక్రమాదిత్య గౌరవార్థం దీనికి ఐఎన్ఎఎస్ విక్రమాదిత్యగా నామకరణం చేసింది.