ETV Bharat / bharat

రైలు ఇంజిన్​లో మంటలు.. తప్పిన ప్రమాదం - latehar

ఝార్ఖండ్​లోని లాతోహర్​ జిల్లా టోరీ శివపుర వద్ద ఓ రైలు ఇంజిన్​లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. లోకోపైలెట్లు అప్రమత్తమై రైలును నిలిపివేయటం వల్ల ప్రమాదం తప్పింది.

train fire
రైలు ఇంజిన్​కు మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం
author img

By

Published : Mar 6, 2021, 5:42 PM IST

ఝార్ఖండ్​లోని లాతోహర్​ జిల్లా ఫుల్​బాసియా రైల్వే స్టేషన్​ సమీపంలోని టోరీ శివపుర వద్ద ఓ గూడ్స్​ రైలు ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. లోకోపైలెట్లు అప్రమత్తమై రైలును నిలిపివేయటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

గూడ్స్​ రైలు ఇంజిన్​కు మంటలు

బొగ్గును తరలిస్తున్న ఈ రైలు ఇంజిన్​లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. కాసేపటికి అవి ఇంజిన్​ అంతా వ్యాపించాయి. సిబ్బంది సమయస్ఫూర్తితో ఇంజిన్​ను బోగిల నుంచి వేరుచేయడం వల్ల బోగీలకు మంటలు అంటుకోలేదు.

అదే కారణమా..

ఇంజిన్​లో మంటలు చెలరేగడానికి కారణం షార్ట్​ సర్క్యూట్​ అని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన వల్ల ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఇదీ చదవండి : ప్రభుత్వం రైతులను వేధిస్తోంది: రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.