దిల్లీలోని ఓ మురికివాడలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మంటల్లో చిక్కుకుని ఐదేళ్ల బాలుడు అగ్నికి ఆహుతయ్యాడు. మృతుడు బంగాలీ బస్తీ మురికి వాడకు చెందినవాడని అధికారులు తెలిపారు.
ఈ అగ్నిప్రమాదంలో 24 గుడిసెలు దగ్ధమయ్యాయని రోహినీ ప్రాంతంలోని మురికివాడ పెద్ద అనరూల్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
గ్యాస్ సిలిండర్ పేలి..
కర్ణాటక విజయనగర జిల్లా హోసాపేటలో ఓ టీ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతిచెందారు. టీ షాపు యజమాని క్రిష్ణమూర్తి, అతని అక్క కూతురు (11 ఏళ్ల చిన్నారి) ఈ ఘటనలో మరణించారని స్థానికులు పోలీసులకు తెలిపారు. గ్యాస్ పేలి దుకాణమంతా దగ్ధమైందని వెల్లడించారు.
ఇదీ చదవండి:ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా