భోపాల్‌లోని కమల నెహ్రూ ఆస్పత్రి పిల్లల వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. వార్డులో 40 మంది చిన్నారులు ఉండగా అందులో 36 మంది క్షేమంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు. మృతుల తల్లిదండ్రులకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని పేర్కొన్నారు.
12 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. ఘటనపై సమాచారం అందుకున్న రాష్ట్ర మంత్రి విశ్వాస్ సారంగ్.. ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న చిన్నారుల బంధువులు అక్కడికి పరుగులు తీశారు. దీంతో ఆస్పత్రి లోపల, బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది.