ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తక్షణమే రోగులను ఖాళీ చేయించి.. వారికి తగిన సౌకర్యాలను కల్పించాలని ఆధికారులకు సూచించారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
ప్రధాన కార్యదర్శి, వైద్యవిద్య విభాగ అధిపతులు, అగ్నిమాపక విభాగ డైరెక్టర్ జనరల్ సహా ఉన్నత స్థాయి బృందం.. ఘటనా స్థలాన్ని సందర్శించి నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు యోగి.
ఈ ఘటనకు కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు.
ఇదీ చూడండి: గ్యాస్ సిలిండర్ పేలుడు- ఏడుగురికి గాయాలు