ETV Bharat / bharat

భారీ అగ్ని ప్రమాదం- ఇద్దరు చిన్నారులు మృతి - today: fire in delhi

ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 150 గుడిసెలు కాలిపోగా.. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Fire broke out in bahlolpur village of noida
ఉత్తర్​ప్రదేశ్​లో భారీ అగ్ని ప్రమాదం-150 ఇళ్లు దగ్ధం
author img

By

Published : Apr 11, 2021, 6:19 PM IST

ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నోయిడా సెక్టార్‌-63లో కూలీలు వేసుకున్న 150 గుడిసెలు మంటల్లో కాలిపోయాయి. ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లో భారీ అగ్ని ప్రమాదం-150 ఇళ్లు దగ్ధం

మధ్యాహ్నం.. సెక్టార్‌ 63లోని ఓ గుడిసెలో మంటలు చెలరేగగా క్షణాల్లో అన్నివైపులా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న రెండు అగ్నిమాపక యంత్రాలు.. మంటలను అదుపు చేశాయి.

సిలిండర్​ పేలడం వల్ల ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకొని.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: చెల్లిని చంపి.. అన్న అండతో అడవిలో పూడ్చిన బాలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.