కోల్కతాలోని బంగాల్ రాష్ట్ర సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. నబన్నాలోని 14వ అంతస్తులో మంగళవారం మంటలు ఎగిసిపడ్డాయి. ఇక్కడే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
మంగళవారం ఉదయం 11:55కు మంటలను గుర్తించారు. టెలిఫోన్ టవర్ పరికరాలకు సంబంధించిన ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. నాలుగు అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి.
దుర్గా పూజ సందర్భంగా సచివాలయానికి సెలవు కావడం వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.
ఇదీ చూడండి:- సచివాలయానికి బాంబు బెదిరింపు- రైతు పనే!