ETV Bharat / bharat

మహానగర పాలక సంస్థ ఆఫీస్​లో అగ్నిప్రమాదం.. 8 మంది ఉద్యోగులకు తీవ్రగాయాలు - bangalore latest news

Fire Accident BBMP Office Bangalore : బెంగళూరులోని బీబీఎంపీ కార్యాలయ ఆవరణలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Fire Accident BBMP Office Bangalore
Fire Accident BBMP Office Bangalore
author img

By

Published : Aug 11, 2023, 6:09 PM IST

Updated : Aug 11, 2023, 7:31 PM IST

మహానగర పాలక సంస్థ ఆఫీస్​లో అగ్నిప్రమాదం..

Fire Accident BBMP Office Bangalore : కర్ణాటక.. బెంగళూరులోని బీబీఎంపీ (బృహత్​ బెంగళూరు మహా నగర పాలికే) కార్యాలయ ఆవరణలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న బీబీఎంపీ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌, వెస్ట్‌ డివిజన్‌ అదనపు పోలీసు కమిషనర్‌ సతీశ్​ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

"బీబీఎంపీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఉన్న క్వాలిటీ కంట్రోల్​ విభాగానికి చెందిన లేబరేటరీలో ఈ ప్రమాదం జరిగింది. ఓవెన్​ బాక్స్​ లీక్​ కావడం వల్లే మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. గాయపడిన ఉద్యోగులను విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం. అందులో నలుగురు తీవ్రమైన కాలినగాయాలతో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాం. అగ్నిప్రమాదానికి గల అసలు కారణం దర్యాప్తు తర్వాత తెలుస్తుంది" అని పశ్చిమ డివిజన్ అదనపు పోలీసు కమిషనర్ సతీశ్ తెలిపారు.

Bangalore Fire Accident Today : "శుక్రవారం సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య కార్యాలయంలో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. అప్పుడు వెనుక ఉన్న లేబరేటరీలో మంటలు చెలరేగుతున్నట్లు కొందరు ఉద్యోగులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాం. ప్రథమ చికిత్స అందించి గాయపడిని ఉద్యోగులను అంబులెన్స్‌లో విక్టోరియా ఆస్పత్రికి తరలించాం" అని బీబీఎంపీ చీఫ్​ కమీషనర్​ తుషార్​ గిరినాథ్​ మీడియాతో తెలిపారు.

  • #UPDATE | The incident took place around 5pm. 8 people got injured and they have been sent to hospital. Fire tenders are present on the spot. Cause of fire will be known after investigation: BBMP Chief Commissioner Tushar Giri Nath pic.twitter.com/hVidz7iSf5

    — ANI (@ANI) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిల్లీ మెడికల్​ కాలేజీలో మంటలు..
Delhi Medical College Fire Accident : దిల్లీలోని హార్డింజ్​ మెడికల్​ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు. "హార్డింజ్ మెడికల్ కాలేజీ మొదటి అంతస్తులోని అనాటమీ విభాగంలో ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ఫోన్​ వచ్చింది. వెంటనే ఏడు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి" అని అధికారులు తెలిపారు.

గోదాములో అగ్నిప్రమాదం..
Kolkata Fire Accident : బంగాల్​.. కోల్​కతాలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. భవనం బేస్​మెంట్​లో ఉన్న గోదాములో అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు చెప్పారు. శుక్రవారం ఉదయం 7.35 గంటలకు బీబీ గంగూలీ స్ట్రీట్‌లోని బీజీ6 భవన బేస్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మంటలను ఐదు అగ్నిమాపక యంత్రాలు అదుపులోకి తీసుకొచ్చాయని వెల్లడించారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. 10 మంది స్పాట్ డెడ్​.. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

బైక్​లపైకి దూసుకెళ్లిన లారీ.. స్పాట్​లో ఆరుగురు మృతి.. బొలెరో లోయలో పడి మరో ఏడుగురు..

Last Updated : Aug 11, 2023, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.