జమ్ముకశ్మీర్లో బుధవారం మృతిచెందిన పాకిస్థాన్ అనుకూల ఏర్పాటువాద నేత సయ్యద్ అలి షా గిలానీ (Syed Ali Shah Geelani) మృతదేహంపై పాక్ జాతీయ జెండా కప్పినందుకు ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా అధికారులు వెల్లడించారు.
పొరుగు దేశం జెండా భౌతికకాయంపై కప్పడం, భారత వ్యతిరేక నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది.
పాకిస్థాన్ అనుకూల వైఖరి అవలంబిస్తూ వచ్చిన జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ(92) ఇటీవల మృతిచెందారు. 1929 సెప్టెంబర్ 29న బందిపొరా జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించిన ఆయన.. లాహోర్‌లోని ఓరియంటల్ కాలేజీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు. అనంతరం జమాత్-ఏ-ఇస్లామిలో చేరారు. సోపోర్ నియోజకవర్గం నుంచి 1972, 1977, 1987 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 26 పార్టీలతో వేర్పాటువాద సమ్మేళనంగా ఏర్పడిన హురియత్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుల్లో గిలానీ ఒకరు.
ఇదీ చూడండి: ఐసిస్-కేలో భారతీయుల కీలక పాత్ర - ఆ దాడి పని కేరళవాసిదే!