కర్ణాటక బళ్లారిలోని ఓ మూవీ థియేటర్.. ప్రేక్షకులను ఆకర్షించేందుకు వినూత్న ఆలోచన చేసింది. తమ థియేటర్లో ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అంటూ బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది.
![Film theatre offers a unique](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10667381_469_10667381_1613572344918.png)
కరోనా తరువాత థియేటర్లు తెరుచుకున్న నేపథ్యంలో.. ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఈ ఆలోచన చేసినట్టు థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. సూపర్‌హిట్ సినిమాలకు ఒక టికెట్ తీసుకున్న ప్రేక్షకులకు మరో టికెట్ ఉచితంగా ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది.
అయితే.. ప్రస్తుతానికి బ్లాక్ బాస్టర్ మూవీ మేళా పేరిట ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.
![Movie hall makes 'buy one ticket, get one free' offer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bly-2-cine-theatre-offers-vsl-7203310_17022021112631_1702f_1613541391_602_1702newsroom_1613556745_819.jpg)
![Movie hall makes 'buy one ticket, get one free' offer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bly-2-cine-theatre-offers-vsl-7203310_17022021112631_1702f_1613541391_710_1702newsroom_1613556745_388.jpg)
''ఈ ఆఫర్‌తో కన్నడ, తెలుగు, తమిళ సినిమాలు చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఆఫర్ ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు మాత్రమే వర్తిస్తుంది. భవిష్యత్‌లోనూ ప్రత్యేక రోజులు, మంచి సినిమాల విడుదల సమయంలో గురు, శుక్రవారాల్లో ఈ ఆఫర్ పెడతాం.''
-లక్ష్మీకాంత రెడ్డి, థియేటర్ యజమాని.
ఇదీ చదవండి: 'చెక్' లిరికల్ సాంగ్.. '101 జిల్లాల అందగాడు' రిలీజ్ డేట్