ETV Bharat / bharat

అధికారంలోకి వస్తే డ్రగ్​ మాఫియా అంతం: కమల్

తమిళనాట తాము అధికారంలోకి వస్తే డ్రగ్​ మాఫియాను అంతం చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామని మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​ హాసన్​ తెలిపారు. మత్తుపదార్థాల వల్ల లక్షలాది మంది యువత జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Fighting against drug mafia to be my priority: Kamal Haasan
అధికారంలోకి వస్తే డ్రగ్​ మాఫియా అంతమే: కమల్
author img

By

Published : Mar 17, 2021, 9:47 PM IST

తాము అధికారంలోకి వస్తే డ్రగ్​ మాఫియాపై పోరుకే అధిక ప్రాధాన్యం ఇస్తామని మక్కల్​ నీది మయ్యం(ఎంఎన్​ఎం) అధినేత కమల్​ హాసన్ తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న దక్షిణ కోయంబత్తూర్​ నియోజకవర్గంలో బుధవారం ఆయన ప్రచారం నిర్వహించారు.

"వేలాది మంది, బహూశా లక్షలాది మంది యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్​ మాఫియాకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. మేం అధికారంలోకి వస్తే.. ఈ మాఫియాను తమిళనాడు సహా మొత్తం భారత్​లోనే లేకుండా చేస్తాం."

-కమల్​ హాసన్​, మక్కల్ నీది మయ్యం అధినేత

డ్రగ్​ మాఫియాను అంతం చేసే దిశగా.. ప్రభుత్వ అధికారులు తరుచూ తనిఖీలు నిర్వహించాలని కమల్​ అన్నారు. దక్షిణ కోయంబత్తూర్​లో కొన్నిరోజులుగా స్థానికులతో మమేకం అవుతూ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో అందరికంటే ధనవంతుడు కమల్​ హాసనే కావడం గమనార్హం. తనకు రూ.45 కోట్ల చరాస్తులు ఉన్నాయని నామినేషన్​ అఫిడవిట్​లో ఆయన​ తెలిపారు.

ఇదీ చూడండి:ఎల్​డీఎఫ్ వ్యూహంతో తమిళనాట కమల్ పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.