ETV Bharat / bharat

చదువు బీటెక్.. వృత్తి క్యాబ్ డ్రైవర్.. రోజుకు 6గంటలు పని.. నెలకు రూ.40వేలు ఆదాయం! - దీప్తా ఘోష్​ మహిళా క్యాబ్ డ్రైవర్​

ఆ యువతి బీటెక్​ చదువుకుంది. వివిధ కంపెనీల్లో పనిచేసింది. మూడేళ్ల క్రితం తండ్రిని కోల్పోయింది. జీతం సరిపోక ఉద్యోగాన్ని మానేసింది. తండ్రి లేని కుటుంబాన్ని ఆదుకునేందుకు క్యాబ్​ డ్రైవర్‌గా మారింది. ప్రస్తుతం నెలకు రూ.40 వేలు సంపాదిస్తోంది. ఇంజనీరింగ్ చదివి క్యాబ్​ డ్రైవర్‌గా మారిన ఆ యువతి కథ తెలుసుకుందాం.

Female Uber driver story
Female Uber driver story
author img

By

Published : May 5, 2023, 12:04 PM IST

ప్రసుత్త రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. అంగడి నుంచి అంతరిక్షం వరకు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. పరిస్థితులకు తగ్గట్లు తమ జీవితాన్ని, భవిష్యత్తును మార్చుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. అయితే ఈ కోవకే చెందిన ఓ యువతి.. ఇంజినీరింగ్​ చదివి.. అనేక సంస్థల్లో పనిచేసి.. ప్రస్తుతం క్యాబ్​ డ్రైవర్‌గా స్థిరపడింది.

బంగాల్​లోని కోల్‌కతాకు చెందిన దీప్తా ఘోష్ అనే యువతి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పాసైంది. వివిధ కంపెనీల్లో ఆరు సంవత్సరాల పాటు పని చేసింది. మూడేళ్ల క్రితం 2020లో ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. దీంతో ఆమె కుటుంబానికి డబ్బు విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే దీప్తా ఘోష్​ జీతం.. కుటుంబాన్ని పోషించేందుకు సరిపోలేదు. దీంతో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం వెతికింది. కోల్‌కతా దాటి వెళ్లి చేయాల్సిన ఉద్యోగాలు వచ్చాయి.

కానీ తండ్రి మరణించిన తర్వాత తన తల్లిని, చెల్లిని వదిలిపెట్టి వెళ్లడం ఆమెకు నచ్చలేదు. అందుకు ఉద్యోగం కోసం వెతకడం మానేసింది. అప్పటికే ఆమెకు డ్రైవింగ్‌లో కాస్త అనుభవం ఉండటం వల్ల కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. కొందరి సహాయంతో లైసెన్స్​ పొందింది. కొన్ని రోజుల పాటు కారు డ్రైవింగ్​ నేర్చుకుంది. ఆ తర్వాత 2021లో కారును కొనుగోలు చేసింది. క్యాబ్​​ డ్రైవర్​గా మారి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది!

Female Uber driver story
దీప్తా ఘోష్​

"నేను 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఆ తర్వాత చాలా కంపెనీల్లో పనిచేశాను. కానీ పెద్దగా సంపాదించలేదు. 2020లో అనారోగ్యంతో మా నాన్న చనిపోయారు. నా జీతం కుటుంబాన్ని పోషించడానికి సరిపోలేదు. ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో మా అమ్మ కాస్త భయపడింది. కమర్షియల్​ లైసన్స్​ పొందాను. ఆ తర్వాత క్యాబ్​ డ్రైవర్​గా మారాను. అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు. రోజుకు 6-7 గంటలు కష్టపడుతున్నాను. నెలకు రూ.40,000 వరకు సంపాదిస్తున్నాను"

-- దీప్తా ఘోష్​

అయితే దీప్తా ఘోష్​ స్టోరీని.. పరమ్​ కల్యాణ్​సింగ్​ అనే ఫేస్​బుక్​ యాజర్​ షేర్​ చేశారు. కోల్​కతాకు చెందిన ఆయన ఓ ప్రాంతానికి వెళ్లేందుకు క్యాబ్‌ను బుక్ చేసుకుంటే దీప్త నుంచి కాల్ వచ్చింది. క్యాబ్ ఎక్కిన తరువాత ఆమె మాట తీరు.. మర్యాద చూసి పరమ్ కల్యాణ్​ ఆమె వివరాలు అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆమె కథ పూర్తిగా తెలుసుకుని.. తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. బంగాల్​లో తొలి క్యాబ్​ డ్రైవర్​గా రికార్డుకెక్కిన ఆమెకు అనేక మంది అభినందనలు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.