ETV Bharat / bharat

మరో ఘోరం.. వాహనంతో ఢీకొట్టి మహిళా ఎస్సై హత్య - రాంచీ మహిళా ఇన్​స్పెక్టర్ హత్య

ఝార్ఖండ్​లో సబ్ ఇన్​స్పెక్టర్​ను వాహనంతో ఢీకొట్టి చంపేశారు దుండగులు. చెక్​పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఎస్సైపైకి వాహనాన్ని పోనిచ్చారు.

murder-of-female-inspector
murder-of-female-inspector
author img

By

Published : Jul 20, 2022, 10:01 AM IST

Updated : Jul 20, 2022, 10:09 AM IST

హరియాణాలో డీఎస్​పీ హత్య జరిగిన రోజే ఝార్ఖండ్​లో అదే తరహా దారుణం చోటుచేసుకుంది. రాంచీలో నేరస్థులు ఓ మహిళా ఎస్సైని దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి చంపేశారు.
మృతురాలు సంధ్యా టోప్పో తుపుదానా పోలీస్ స్టేషన్​లో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ చెక్​పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సంధ్య.. దారిలో వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులను పట్టించుకోకుండా నిందితులు.. వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో సబ్ ఇన్​స్పెక్టర్ సంధ్యపై నుంచి వాహనం దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను రిమ్స్​కు తరలించగా.. అక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సంధ్య టోప్పో

ఇదీ చదవండి: లారీతో ఢీకొట్టి డీఎస్​పీ దారుణ హత్య.. రిటైర్మెంట్​కు ముందే.. మైనింగ్ మాఫియా పనే!

Last Updated : Jul 20, 2022, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.