father son granted bail in TSPSC paper leak case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది. మైబయ్య, జనార్దన్‌లకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు బెయిల్ పొందిన వారి సంఖ్య 17కు చేరింది. ఇక మైబయ్య.. తమ కుమారుడు జనార్దన్ కోసం ఢాక్యా నాయక్ నుంచి రూ.2 లక్షలకు ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు సిట్ అధికారుల విచారణలో తేలడంతో ఏప్రిల్ 21న మైబయ్య, ఆయన కుమారుడు జనార్దన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
TSPSC Paper Leak News in Telugu : మరోవైపు.. ఈ కేసులో ప్రమేయమున్న 37 మంది నిందితులను డీబార్ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ 37 మంది నిందితులు ఇకపై కమిషన్ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని టీఎస్పీఎస్సీ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని నిందితులకు నోటీసులు జారీ చేసింది. లేకపోతే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ నియామక పరీక్షలు రాయకుండా డీబార్ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే.. తమపై డీబార్‌ను ఎత్తివేయాలంటూ ఇటీవల 16 మంది నిందితులు కమిషన్‌ను ఆశ్రయించారు. వారి వివరణలు విన్న కమిషన్.. సంతృప్తికరంగా లేకపోవడంతో డీబార్‌ను ఎత్తివేయడానికి నిరాకరించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి నియామక పరీక్షలు రాయకూడదని నిందితులకు స్పష్టం చేసింది.
- TSPSC Paper Leakage Case : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. 37 మందిపై అభియోగపత్రం?
- SIT inquiries DE Ramesh in TSPSC Case : 'మాస్ కాపీయింగ్ సూత్రధారి డీఈ రమేశ్ లీలలెన్నో'
SIT Preliminary Charge Sheet TSPSC Leakage : ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే తమ దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్ అధికారులు మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించి అభియోగ పత్రం దాఖలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం 37 మందిని నిందితులుగా చేరుస్తూ సిట్ అభియోగ పత్రం సిద్ధం చేస్తోంది. ముందుగా న్యాయనిపుణుల సలహా తీసుకొని.. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 50 మందిని అరెస్ట్ చేయగా.. అభియోగ పత్రంలో మాత్రం 37 మందిని నిందితులుగా చేర్చనున్నారు. ఆ 37 మందిలో ఒక్క ప్రశాంత్‌రెడ్డి మినహా మిగతా నిందితులందరినీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రశాంత్‌రెడ్డి ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉండటంతో సిట్ అధికారులు అతడికి లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నారు. 37 మందిలో 15 మంది నిందితులు ఇప్పటికే బెయిల్‌పై బయటకు రాగా.. నేడు మరో ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది.
ఇవీ చూడండి..
TSPSC Paper Leak Case Update : 'హైటెక్ మాస్‌కాపీయింగ్‌లో మాజీ ఎంపీటీసీ కుమార్తె'
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం డేట్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్