Father Shot Son Rapes Daughter Uttar Pradesh : కుమార్తెపై అత్యాచారం చేస్తున్నందుకు అడ్డుకున్న కుమారుడిపై కాల్పులు జరిపాడు ఓ కసాయి తండ్రి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో జరిగిందీ ఘటన. ప్రస్తుతం బాధిత బాలుడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఘటన అనంతరం నిందితుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Uttar Pradesh Crime News 2023 : గోసాయ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం నిందితుడి భార్య చాలారోజుల క్రితమే చనిపోయింది. నిందితుడు తన ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఆదివారం రాత్రి తన పెద్ద కుమార్తెపై అత్యాచారానికి యత్నించాడు. రాత్రి వేళ శబ్దాలు విని నిద్రలేచిన నిందితుడి కుమారుడు.. తన సోదరిపై తండ్రి అత్యాచారం చేయడాన్ని గమనించాడు. తండ్రి దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య గొడవ మొదలైంది. వాగ్వాదం తీవ్రంగా మారగానే.. నిందితుడు తుపాకీతో కుమారుడిపై కాల్పులు జరిపాడు. దవడలోకి బుల్లెట్ దూసుకెళ్లడం వల్ల అతడు అక్కడే పడిపోయాడు. బాధితుడికి తీవ్ర రక్తస్రావం కావడాన్ని చూసిన నిందితుడు.. ఇంట్లో నుంచి పారిపోయాడు.
నిందితుడి కుమార్తెలు ఓ టవల్ తీసుకొచ్చి తన సోదరుడి తలకు కట్టారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి గాయపడ్డ తమ సోదరుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు శ్రమించారు. చీకట్లో ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ప్రాథమిక హెల్త్ సెంటర్లో చేర్పించారు. అయితే, బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల వైద్యుల సిఫార్సు మేరకు దర్శన్ నగర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి వైద్యులు లఖ్‌నవూకు వెళ్లమని సూచించగా.. రాజధానిలోని ట్రామా సెంటర్‌కు తమ సోదరుడిని తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడు అక్కడే చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్పీ అతుల్ సోంకర్ వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. 'ఘటన జరిగిన తర్వాత నిందితుడు పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాం. గాయపడ్డ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది' అని సోంకర్ వివరించారు.
స్కూల్ విద్యార్థినిపై కాల్పులు
బిహార్‌లోని ఆరా పట్టణంలో గుర్తు తెలియని దుండగుడు స్కూల్ నుంచి తిరిగి వస్తున్న తొమ్మిదో తరగతి విద్యార్థినిపై కాల్పులు జరిపారు. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన జరిగింది. స్థానికుల సహాయంతో బాధితురాలిని సదర్ ఆస్పత్రికి తరలించారు. స్కూల్ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు ప్రతిరోజు దుండగులు తమను వేధిస్తున్నారని బాధిత బాలిక స్నేహితురాళ్లు చెబుతున్నారు. కొన్నిసార్లు తుపాకులతో బెదిరించేవారని తెలిపారు. ఎప్పటిలాగే మళ్లీ వేధించేందుకు ప్రయత్నించగా.. తాము అడ్డుచెప్పామని.. దీంతో దుండగుల్లో ఒకరు తమ స్నేహితురాలి పొట్టలో కాల్పులు జరిపాడని వివరించారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు భోజ్‌పుర్ ఎస్పీ ప్రమోద్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నిందితుడికి బాలికకు గతంలో ఏదో వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలోనే అతడు కాల్పులు జరిపాడని పోలీసులు చెబుతున్నారు.
కట్నం కోసం నాలుగు నెలల గర్భిణీకి నిప్పు.. వారంపాటు నరకం అనుభవించి మృతి
13 ఏళ్ల బాలికపై 28 రోజులుగా గ్యాంగ్‌రేప్.. కిడ్నాప్ చేసి దారుణం