ETV Bharat / bharat

పెట్రోల్ పోసి కొడుకు కుటుంబాన్నే తగలబెట్టాడు- కారణం ఏంటంటే? - తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య ఇడుక్కి

father set his fire on son idukki: కన్న కొడుకుని, అతని కుటుంబ సభ్యులను హతమార్చాడు ఓ కిరాతక తండ్రి. ఆస్తి గొడవలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో జరిగింది.

father set on fire son family
కుమారుని కుటుంబాన్నే తగలబెట్టిన తండ్రి
author img

By

Published : Mar 19, 2022, 10:12 AM IST

father set his fire on son idukki: కన్న కొడుకు , అతని కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఓ తండ్రి. ఈ ఘటన కేరళలోని తొడుపుజా సమీపంలో గల చినికుజి గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో ఫైజల్ , అతని భార్య, ఇద్దరు పిల్లలు మెహ్రా(16), అస్నా(13) ప్రాణాలు కోల్పోయారు.

ఆస్తి తగాదాలే కారణం..

తొడుపుజాకు చెందిన ఫైజల్ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈయన తండ్రి హమీద్.. 50సెంట్ల భూమిని ఫైజల్​కు ఇచ్చాడు. అనంతరం వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడి విడివిడిగా ఉంటున్నారు. 2018లో హమీద్​.. తన కుమారుడు ఫైజల్​కి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వాలని డిమాండ్​ చేశాడు . ఫైజల్ తన​ భూమిని తిరిగి తండ్రికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీంతో కోపం పెంచుకున్న హమీద్.. ఫైజల్ కుటుంబాన్ని హతమార్చాడు.

నిందితుడు హమీద్​ పక్కా ప్రణాళిక ప్రకారం హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. హమీద్ ఇంట్లో ముందుగానే పెట్రోల్ కొనుక్కొని ఉంచుకున్నాడు. మంటలను ఆర్పేందుకు వీలులేకుండా ఫైజల్ ఇంట్లోని వాటర్ ట్యాంక్​ను ఖాళీ చేశాడు. ఫైజల్ కుటుంబం నిద్రలో ఉండగా శనివారం రాత్రి ఒంటి గంటకు పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. వీరి హత్య అనంతరం నిందితుడు హమీద్.. దగ్గర్లోని బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడే నిందితుడు హమీద్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: కాలేజ్​లో ప్రేమ.. ఉద్యోగంలో సహజీవనం.. పెళ్లి అనేసరికి కులం.. పెట్రోల్ పోసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.