Father Killed Daughter in Prakasam: తండ్రి అంటే లాలించేవాడు.. గుండెల మీద పెట్టుకుని చూసుకునేవాడు. బిడ్డకు ఏ కష్టమొచ్చినా తనకే వచ్చిందేమో అనేంతా బాధ పడతాడు. బిడ్డ కష్టం తీరాలని ఎంతో వేదన చెందుతాడు. తాను సుఖపడకపోయినా.. తన పిల్లలు మంచిగా ఉంటే చాలు అనుకుంటూ గడుపుతాడు. కానీ ఇక్కడ ఓ తండ్రి వీటన్నింటికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. పాము తన పిల్లలను తానే మింగినట్లు ఇక్కడ రక్తం పంచుకు పుట్టిన కూతురిని తండ్రే హత్య చేశాడని తల్లి ఆరోపిస్తోంది.
ఈ రోజుల్లో చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూస్తూ.. సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. కూర్చోని పరిష్కరించుకునే విషయాల కోసం ప్రాణాలు తీసుకోవడం.. లేదంటే ఇతరులు ప్రాణాలు తీయడం చేస్తున్నారు. నిండు నూరేళ్లు బతకాల్సిన వాళ్లు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన కూడా ఇందుకు సంబంధించిందే.
జిల్లాలోని కనిగిరి మండలం.. N.గొల్లపల్లి సమీపంలోని చెరువు వద్ద స్థానికులు 12 ఏళ్ల అమ్మాయి శవాన్నిగుర్తించారు. ఎంత దారుణం జరిగిందంటూ అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. బేల్దారి పని కోసం.. అటుగా వెళ్తున్న నరసమ్మ కూడా.. అందరూ గుమిగూడారోంటో చూద్దామని అక్కడికి వెళ్లారు. ఇక అంతే ఆమె గుండె చెరువైంది. అయ్యో అంటూ గుండెలు బాదుకుంది. అక్కడ నిర్జీవంగా పడి ఉంది ఎవరో కాదు.. నరసమ్మ చిన్న కుమార్తె మంజుల.
Murder Attempt on Dalit Woman: దళిత మహిళపై దారుణ కీచకకాండ.. వివస్త్రను చేసి.. వీధుల్లో ఈడ్చుకెళ్లి..
మంజుల.. కనిగిరిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. చదువుల తల్లి ఇలా ఎందుకు ఛిద్రమైందో నరసమ్మకు.. తొలుత అర్థం కాలేదు. ఈలోగా అక్కడ గుమిగూడిన వారు ఓ క్లూ ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి పాపను చెరువు వైపు తీసుకెళ్లినట్లు.. చెప్పారు. నరసమ్మకు అప్పుడు అర్థమైంది. తన భర్తే చంపాడని అనుమానించింది.
మార్కొండపురానికి చెందిన వెంకటేశ్వర్లు.. వెంకట నరసమ్మ కుటుంబ కలహాలతో కొంతకాలంగా.. దూరంగా ఉంటున్నారు. వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై వేధిస్తున్నాడంటూ.,. నరసమ్మ తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని పద్మనాభపురంలోని పుట్టింటికి వెళ్లింది. భార్యపై కక్షగట్టిన వెంకటేశ్వర్లు సోమవారం సాయంత్రం మంజుల చదివే పాఠశాలకు వెళ్లాడు. ఇంటికెళ్దాం.. రమ్మంటూ తీసుకెళ్లాడు. తండ్రి ప్రేమకు మురిసిన మంజుల.. అమాయకంగా అతని వెంట వెళ్లిపోయింది.
Doctor Radha Murder Case Update: 'అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎలా కనిపెట్టారు సార్..!'
గొల్లపల్లి వద్ద ఆటో దిగిన వెంకటేశ్వర్లు.. కుమార్తెను సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం మంజుల తలపైబండరాయితో.. కొట్టి చంపి ఉంటాడని భావిస్తున్నారు. ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడి ఉన్న పుస్తకాలు చూస్తే.. కన్నతండ్రి హత్యాయత్నాన్ని.. మంజుల తీవ్రంగానే ప్రతిఘటించినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంజుల తండ్రిని CS పురంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Woman Killed and Burnt in Shamshabad : శంషాబాద్‌లో దారుణం.. మహిళను చంపేసి కాల్చేశారు