ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారబంకీ జిల్లా మల్లాపుర్ గ్రామంలో శనివారం అమానుష ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన కోడలిని అమ్మేశాడు. ఇందుకోసం గుజరాత్‌కు చెందిన పలువురితో రూ.80వేలకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాధితురాలితో సహా రైల్వే స్టేషన్లో తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న పలువురు నిందితులను అరెస్టు చేశారు. వారి చెర నుంచి బాధితురాలిని విడిపించారు.
అరెస్టు చేసిన 8 మంది నిందితులలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, బాధితురాలి మామగారైన చంద్రరామ్ సహా మరో నిందితుడు రాము గౌతమ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ జరిగింది..
నిందితుడు చంద్రరామ్ కుమారుడు ప్రిన్స్ వర్మకు 2019లో బాధితురాలితో బారబంకీలో వివాహం జరిగింది. ప్రిన్స్ వర్మ.. భార్యతో కలిసి గాజియాబాద్‌లో నివసిస్తున్నాడు.
అయితే మల్లాపుర్కే చెందిన రాము గౌతమ్ అనే వ్యక్తి ఇటీవల అహ్మదాబాద్ నుంచి గ్రామానికి వచ్చాడు. అహ్మదాబాద్‌లో తనకు సాహిల్ పంచా అనే వ్యక్తి పరిచయమయ్యాడని.. అతను వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని చంద్రరామ్కు చెప్పాడు. ఎంత ఖర్చు అయినా చేసేందుకు అతను సిద్ధంగా ఉన్నాడని చంద్రరామ్కు స్పష్టం చేశాడు. దీంతో డబ్బు కోసం కోడలిని అమ్మేందుకు నిందితుడు సిద్ధమయ్యాడు.
పథకం ప్రకారం..
తనకు అనారోగ్యంగా ఉందని.. సాయం కోసం కోడలిని పంపించమని కుమారిడిని కోరాడు చంద్రరామ్. దీనికి సరే అన్న ప్రిన్స్ వర్మా జూన్ 4న భార్యను గ్రామానికి పంపించాడు. మరోవైపు పథకం ప్రకారం రాము గౌతమ్ అప్పటికే లఖ్‌నవూ చేరిన సాహిల్ పంచా, అతని కుటుంబసభ్యులను గ్రామానికి చేర్చాడు. చంద్రరామ్ వారి నుంచి రూ.80వేలలో కొంత నగదు రూపంలో తీసుకుని, మిగతాది కుమారుడి ఖాతాలోకి బదిలీ చేయించాడు.
తండ్రి చర్య గురించి తెలుసుకున్న ప్రిన్స్ వర్మా జూన్ 5న గ్రామానికి చేరుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు.
ఘరానా మామ..
వస్తువులను కొనుగోలు చేసి అమ్మినట్లు ప్రధాన నిందితుడు చంద్రరామ్ మహిళలతో వ్యాపారం చేస్తాడు. ఇప్పటివరకు 300 మంది మహిళలను కొనుగోలు చేసి వారిని వివిధ వ్యక్తులకు అమ్మినట్లు సమాచారం. బిహార్, గోరఖ్‌పుర్, దేవరియా, ఇమారియా గంజ్ ప్రాంతాల నుంచి మహిళలను కొనుగోలు చేసి వారిని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి అమ్ముతాడు. క్రయ విక్రయాలకు 8 నుంచి 10 వేల చొప్పున కమీషన్ చంద్రరామ్ అందుకుంటాడు. వీరిని వివాహం చేసుకోవాలనుకున్న వారి నుంచి 40-50 వేలు వసూలు చేస్తాడు.
ఓ హత్యకేసులో కూడా చంద్రరామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు సమాచారం.
ఇవీ చూడండి : Rape: 65ఏళ్ల తల్లిపై కొడుకు అత్యాచారం!