మైనర్ కూతురిపై (14) అత్యాచారం చేసిన కిరాతకుడికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ జిల్లా న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అంతేకాకుండా రూ.51,000 జరిమానా విధించింది. ఈ విషయాన్ని ఆ జిల్లా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. కేసు నమోదు చేసిన మూడు నెలల్లోనే తీర్పు వెలువరించినట్లు చెప్పారు.
'తండ్రి తన కూతురికి వివాహం చేశాడు. తిరిగి ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చాలా రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు,' అని సింగ్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 25న బాలిక తల్లి కేసు నమోదు చేసింది. తండ్రి భయంతోనే రెండేళ్లుగా తాను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని బాలిక వెల్లడించింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరపరుచగా ప్రస్తుతం తీర్పు వెలువడింది.
ఇదీ చదవండి: బ్లేడ్‌తో విద్యార్థిని గొంతు కోసి.. ఆస్పత్రి వరకు వెంబడించి..