ETV Bharat / bharat

కన్న కూతురిపై తండ్రి లైంగిక వేధింపులు

కేరళలోని కోజికోడ్​లో దారుణం జరిగింది. ఓ తండ్రి తన 12 ఏళ్ల కుమార్తెపై లైంగిన వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

sexual harassment
కన్న కూతురిపైనే తండ్రి లైంగిక వేధింపులు
author img

By

Published : Oct 8, 2021, 4:08 PM IST

కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచక తండ్రి. కేరళలోని కోజికోడ్​లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా తన భర్త ఇప్పుడు పరారీలో ఉన్నాడని బాధితురాలి తల్లి ఆరోపించింది. భర్త తరపు బంధువులు ఫిర్యాదును వెనక్కి తీసుకోమని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపింది.

బాధితురాలి వివరాలు ప్రకారం..

విదేశాల్లో నివసించే నిందితుడు.. ఇటీవల కేరళకు వచ్చాడు. తన 12 ఏళ్ల కుమార్తెకు అసభ్యకర వీడియోలు చూపిస్తూ ఆమెను వేధించేవాడు. తండ్రి చర్యలను ప్రతిఘటించగా.. తల్లిని, చెల్లిని చంపేస్తానని బెదిరించేవాడు.

కుమార్తె ప్రవర్తనలో మార్పును గమనించిన ఆమె తల్లి.. బాధితురాలు చదువుతున్న పాఠశాలను సంప్రదించింది. టీచర్లు బాధితురాలితో మాట్లాడగా అసలు విషయం బయటపడింది. దీంతో బాధితురాలి తల్లి సెప్టెంబరు 28న స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్ట్​ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అతను విదేశాలకు పరారయ్యాడు.

తన భర్త కుటుంబీకులు ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి తల్లి ఆరోపించారు.

ఇదీ చూడండి : తాత మృతదేహం వెతకడానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.