ETV Bharat / bharat

రైతుల ట్రాక్టర్​ ర్యాలీకి దిల్లీ పోలీసుల అనుమతి

author img

By

Published : Jan 23, 2021, 7:07 PM IST

Updated : Jan 23, 2021, 7:35 PM IST

Delhi Police has given permission for tractor parade on Jan 26
రైతుల ట్రాక్టర్​ ర్యాలీకి దిల్లీ పోలీసుల అనుమతి

19:03 January 23

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి దిల్లీ పోలీసులు అనుమతినిచ్చారు. దిల్లీ రింగ్‌రోడ్‌ పరిధిలో ర్యాలీకి అనుమతించినట్లు తెలుస్తోంది. ఘాజీపుర్​, టిక్రీ, సింఘూ సరిహద్దుల నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని రైతు నేతలు తెలిపారు.  

100 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఎన్ని ట్రాక్టర్లు వస్తాయో అన్న అంశంపై రైతు నేతలు దిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అయితే వచ్చిన అన్ని ట్రాక్టర్లకు అనుమతి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ర్యాలీ సందర్భంగా దిల్లీ వచ్చిన ట్రాక్టర్లన్నీ తిరిగి వెళ్తాయని, ఒక్క ట్రాక్టర్‌ కూడా దిల్లీలో ఉండదని రైతు సంఘాల నేతలు పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Last Updated : Jan 23, 2021, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.