దేశ రాజధానికి సమీపంలో రైతులు భారీ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్న వేళ కర్ణాటక వ్యవసాయ మంత్రి బీసీ పాటిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకునే రైతులు పిరికివాళ్లని అన్నారు.
"ఆత్మహత్య చేసుకునే రైతులు పిరికివాళ్లు. తన భార్య, పిల్లలను చూసుకోలేని పిరికివాడే ఆత్మహత్య చేసుకుంటాడు."
-బీసీ పాటిల్, కర్ణాటక వ్యవసాయ మంత్రి
వెదురు సాగు చేసే రైతులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాటిల్ వ్యాఖ్యలను కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తీవ్రంగా ఖండించారు. రైతులను అగౌరపరిచేలా పాటిల్ మాట్లాడారని దుయ్యబట్టారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సైతం పాటిల్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. రైతు సమాజం అంతటికీ ఈ వ్యాఖ్యలు అగౌరవకరమని ఆగ్రహం వ్యక్తం చేసింది.