సాగు చట్టాలను(Farmer laws) ఆర్డినెన్స్‌లుగా ప్రకటించి ఏడాది గడుస్తున్న సందర్భంగా రైతులు నిరసనగా(Farmers protest) జూన్ 5ను సంపూర్ణ 'క్రాంతి దివస్'గా జరపనున్నారు. భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీల కార్యాలయాల ముందు చట్టాల ప్రతులను దగ్దం చేయనున్నామని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. చట్టాలను కేంద్రం మొదట ఆర్డినెన్స్‌లుగా ప్రకటించిన అనంతరం.. సెప్టెంబర్‌లో ప్రతిపాదిత చట్టాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర పడి చట్టాలుగా మారాయి.
"1974, జూన్ 5ను సంపూర్ణ క్రాంతి దివస్‌గా ప్రకటించిన జయ ప్రకాశ్ నారాయణ.. అప్పటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గత ఏడాది జూన్ 5న, సాగు చట్టాలను కేంద్రం ఆర్డినెన్స్‌లుగా ప్రకటించింది.అదే జూన్ 5న దేశమంతటా క్రాంతి దివస్‌గా పాటించాలి. సాగు చట్టాల ప్రతులను కాల్చివేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదో ప్రజా ఉద్యమంగా మారి చట్టాల రద్దుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి."
-సంయుక్త కిసాన్ మోర్చా
మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని రైతు సంఘాలు ఆయనకు నివాళులు అర్పించాయి. రైతులకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నాయి.
పంజాబ్‌లోని దోబా నుంచి పెద్ద సంఖ్యలో రైతులు సింఘూ బార్డర్‌కు శనివారం చేరుకున్నారు. ఉద్యమాన్ని(Farmers protest) ఉద్ధృతం చేయడానికి మరింత మంది రైతులు దిల్లీ సరిహద్దులకు చేరుకుంటారని సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది.
ఇదీ చదవండి: ULFA: 'ప్రభుత్వంతో చర్చలకు వ్యతిరేకం కాదు'