ETV Bharat / bharat

ముగిసిన అన్నదాతల ఒకరోజు నిరాహార దీక్షలు

farmers to observe fast today as protest against farm laws entered 19th day
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరాహార దీక్ష
author img

By

Published : Dec 14, 2020, 8:13 AM IST

Updated : Dec 14, 2020, 5:25 PM IST

17:25 December 14

రైతు సంఘాలు ఏమంటాయి?

  • కాసేపట్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్న రైతుసంఘాల నేతలు
  • కేంద్రం చర్చలకు పిలిస్తే ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న రైతుసంఘాలు
  • చట్టాలకు మద్దతు పలికే సంఘాలతో తమకు సంబంధం లేదన్న రైతుసంఘాలు
  • ఆందోళన చేసే సంఘాలన్నీ ఐక్యంగా ఉన్నాయన్న రైతుసంఘాల నేతలు

17:07 December 14

ముగిసిన నిరాహార దీక్ష

  • ముగిసిన అన్నదాతల ఒకరోజు నిరాహార దీక్షలు
  • సాగు చట్టాల రద్దే ఏకైక డిమాండ్‌గా రైతుసంఘాల నిరాహార దీక్ష
  • 19 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతుసంఘాలు
  • దిల్లీ సరిహద్దుల్లో రహదారులపైనే దీక్షకు దిగిన రైతుసంఘాలు
  • సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సహా పలుచోట్ల రైతుల నిరాహార దీక్షలు
  • అన్నదాతలకు తోడుగా దీక్షా శిబిరాల్లో కూర్చున్న కుటుంబసభ్యులు
  • రైతుల నిరాహార దీక్షకు రాజకీయ పార్టీలు, పలు సంఘాల మద్దతు
  • అన్నదాతల ఆందోళనలకు మద్దతుగా దీక్షకు దిగిన పలు పార్టీలు
  • ఆప్‌తో పాటు ఎస్పీ, అకాలీదళ్‌ శ్రేణుల ఒకరోజు ఉపవాస దీక్ష
  • కేంద్రం దిగివచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటున్న రైతులు

12:35 December 14

  • Delhi: Farmers protesting at Ghazipur (Delhi-UP) border blocked National Highway-24 earlier today.

    “We won’t let it happen again, normal people won’t suffer. We wanted them to realise for once that how even few minutes are important,” says Rakesh Tikait of Bhartiya Kisan Union pic.twitter.com/wVk15yXzA0

    — ANI (@ANI) December 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రహదారి దిగ్బంధం..

దిల్లీ-ఘజిపుర్​ సరిహద్దు వద్ద ఆందోళన చేస్తోన్న రైతులు జాతీయ రహదారి- 24ను దిగ్బంధించారు.

12:15 December 14

  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక భేటీ.
  • భేటీకి హాజరైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా
  • రైతుల ఆందోళన రోజురోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎలా అనుసరించాలి.. వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి పై సమీక్షిస్తున్నట్లు సమాచారం

12:08 December 14

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా నివాసానికి చేరుకున్నారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. రైతు సంఘాలతో మరోసారి భేటీ అంశంపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశముంది.

10:40 December 14

  • Govt is misleading everyone on MSP. Home Minister Amit Shah replied to us during 8th Dec meet that they can't buy all 23 crops at MSP as its costs Rs 17 lakhs crores. : Gurnam Singh Chaduni, President, Bhartiya Kisan Union (Haryana) pic.twitter.com/yUVc9xo1kK

కనీస మద్దతు ధర అంశంపై ప్రతిఒక్కరినీ కేంద్రం తప్పుదోవ పట్టిస్తోందని భారతీయ కిసాన్ యూనియన్​(హరియాణా) అధ్యక్షుడు గుర్ణాం సింగ్ చడూని చెప్పారు. రైతులు పండించే 23 పంటలకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం సాధ్యం కాదని డిసెంబర్ 8న జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. రైతు సంఘాల నాయకులకు స్పష్టం చేశారని పేర్కొన్నారు. వీటి కొనుగోలుకు రూ.17లక్షల కోట్లు ఖర్చు అవుతుందని షా చెప్పారని గుర్ణాం సింగ్​ తెలిపారు. కేంద్రం దృష్టిలో కనీస మద్దతు ధర అంటే గతంలో చెల్లించిన మొత్తంతోనే పంటలను కొనుగోలు చేయటమని, అది తమకు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదన్నారు. ఆ ధరతో రైతులు జీవనం సాగించడం కష్టతరమని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి కనీస మద్దతు ధర చెల్లించి కేంద్రం పంటలను కొనుగోలు చేయడం లేదని గుర్ణా సింగ్ వివరించారు.

10:19 December 14

రాజస్థాన్ హరియాణా సరిహద్దు జైసింఘ్​పుర్​-ఖేరా ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారు రైతులు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రెండో రోజూ నిరసనకు దిగారు. అధికారులు ముందు జాగ్రత్తగా అక్కడ బలగాలను మోహరించారు.

10:13 December 14

సరిహద్దుల మూసివేత..

రైతుల నిరాహార దీక్ష నేపథ్యంలో పలు దిల్లీ సరిహద్దులను మూసివేశారు అధికారులు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వార దేశ రాజధానికి చేరుకోవాలని దిల్లీ ట్రాఫిక్​ పోలీసులు వాహనదారులకు సూచించారు. ఘాజీపుర్ సహా  సింఘు, ఔచందీ, పియావ్​ మనియారి, సభోలి, మంగేశ్​ సరిహద్దులను మూసివేసినట్లు పేర్కొన్నారు.

10:07 December 14

  • Delhi: Farmers' leaders sit on hunger strike at Tikri border as their protest against Centre's farm laws enters 19th day.

    "Centre is being stubborn about our demands. This is an attempt to wake them up," says Balkaran Singh Brar, Working President, All India Kisan Sabha, Punjab pic.twitter.com/KY7mgGwJiT

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టిక్రీ సరిహద్దులో నిరాహార దీక్ష చేపట్టారు రైతు సంఘాల నాయకులు. తమ డిమాండ్ల పట్ల కేంద్రం నోరుమెదపడం లేదని, కేంద్రాన్ని నిద్రలేపే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు దీక్షకు దిగినట్లు ఆల్​ ఇండియా కిసాన్ సభ కార్యనిర్వాహక అధ్యక్షుడు బాల్​కరన్  సింగ్ బ్రార్​ తెలిపారు.

09:19 December 14

  • Delhi: Farmers' leaders including Rakesh Tikait of Bharatiya Kisan Union sit on a hunger strike from 8 am-5 pm at Ghazipur (Delhi-UP border), where the protest entered day 17 today. pic.twitter.com/I2Zkdhxvav

భారతీయ కిసాన్​ యూనియన్ నేత రాకేశ్ టికైత్​ సాహా ఇతర రైతు సంఘాలకు చెందిన నాయకులు దిల్లీ-యూపీ సరిహద్దు ప్రాంతం ఘాజీపుర్​లో ఒక్కరోజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. అక్కడ రైతులు చేపట్టిన ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి.

08:57 December 14

సింఘ సరిహద్దులో రైతుల నిరాహార దీక్ష

దిల్లీ-హరియాణా సరిహద్దు ప్రాంతం సింఘులో ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు రైతులు. 19వరోజూ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 

సాగు చట్టాల రద్దే ఏకైక డిమాండ్‌గా రైతు సంఘాల నిరాహార దీక్ష చేపట్టారు. దిల్లీ సరిహద్దుల్లోని నిరసన ప్రాంతాల్లోనే దీక్షకు కూర్చున్నారు. సింఘు, టిక్రీ, ఘాజిపూర్ సహా నిరసన ప్రాంతాల్లోనే సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. కేంద్రం దిగివచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. ఆందోళనలు ఉద్ధృతం చేసేందుకు దిల్లీ సరిహద్దులకు మరికొంతమంది రైతులు చేరుకుంటున్నారు. 

రైతుల ఆందోళనకు మద్దతుగా దిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈరోజు ఉపవాసం ఉండనున్నారు.

08:48 December 14

  • We want to wake the govt up. So, 40 farmer leaders of our United Farmers Front will sit on hunger strike today at all borders points between 8 am-5 pm. 25 of them will sit at Singhu border, 10 at Tikri border & 5 at UP border: Harinder Singh Lakhowal, General Secy, BKU (Punjab) pic.twitter.com/khQ9VNMC1O

ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకే ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టినట్టు బీకేయూ ప్రధాన కార్యదర్శి హరీందర్ సింగ్ లఖోవాల్ తెలిపారు. వివిధ రైతు సంఘాలకు చెెందిన 40మంది నాయకులు అన్ని సరిహద్దుల్లో ఈరోజు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్షకు కూర్చుంటారని చెప్పారు. 40 మంది నాయకుల్లో 25 మంది సింఘు సరిహద్దులో, 10మంది టిక్రి సరిహద్దులో, ఐదుగురు యూపీ సరిహద్దులో నిరాహార దీక్షలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. 

08:30 December 14

  • Delhi: Farmers' protest at Ghazipur (Delhi-UP border) enters day 17; protesters to observe fast today.

    A protester from Lakhimpur Kheri says, "When we take our sugarcane trolleys to mills, it happens that we skip meals for 24 hours. We are prepared for fast." pic.twitter.com/J4I8pEh6hw

నూతన సాగు చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ దిల్లీ-యూపీ సరిహద్దు ఘాజీపుర్​లో 17రోజూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు రైతులు. చెరకు పంటను మిల్లుకు తరలించేటప్పుడు 24 గంటల పాటు ఆహారం తినకుండా ఉండటం తమకు అలవాటేనని, ఈరోజు చేసే నిరాహార దీక్షకు పూర్తి సన్నద్ధతతో ఉన్నట్లు లఖింపుర్ ఖేరీకి చెందిన ఓ నిరసనకారుడు తెలిపారు.

08:02 December 14

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరాహార దీక్ష

నూతన సాగు చట్టాలను రద్దుచేయాలంటూ దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు అన్నదాతలు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకరోజు నిరాహార దీక్షలకు దిగారు. ఉద్యమ కేంద్రాలైన దిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాల నేతలు దీక్షను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకూ ఉపవాస దీక్షలు కొనసాగుతాయని కర్షకులు వెల్లడించారు.

అన్నదాతల ఆందోళనలకు మద్దతుగా దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా నిరాహారదీక్ష చేయనున్నారు. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్న వారితో తమకు సంబంధం లేదని రైతుసంఘాలు స్పష్టం చేశాయి. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని తెల్చిచెబుతున్నాయి.

Last Updated : Dec 14, 2020, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.