ETV Bharat / bharat

పోరు బాట: నేడు రెండు రహదారులు దిగ్బంధం - సాగు చట్టాలపై రైతుల నిరసన

నూతన సాగు చట్టాలపై రైతులు తమ ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. నేడు దిల్లీ-జైపుర్​, దిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధిస్తామని రైతు నాయకులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం.. రైతులను చర్చలకు రావాలని విజ్ఞప్తి చేసింది.

farm laws agitation
పోరు బాట: నేడు రెండు రహదారులు దిగ్బంధం
author img

By

Published : Dec 12, 2020, 5:35 AM IST

చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుపై రైతులు వెనక్కి తగ్గడం లేదు. వారి ఆందోళనలకు మద్దతు పెరుగుతోంది. అమృత్​సర్​లోని కిసాన్ మజ్దూర్​ సంఘర్ష్​ కమిటీ సభ్యులు 700 ట్రాక్టర్లతో దిల్లీకి బయల్దేరారు. కుండ్లి సరిహద్దులో ఆందోళనలు చేపట్టనున్నారు. శనివారం దిల్లీ-జైపుర్​, దిల్లీ- ఆగ్రా రహదారులను దిగ్బంధిస్తామని రైతు నాయకులు తెలిపారు. టోల్​ గేట్ల వద్ద రుసుం కట్టకుండా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

లాంఛనంగా లేఖ పంపండి..

చర్చలపై ప్రభుత్వానికి ఆసక్తి ఉంటే మునుపటిలాగానే ఆహ్వానిస్తూ లేఖ పంపిచాలని భారతీయ కిసాన్​ నాయకడు రాకేశ్​ తికాయత్​ తెలిపారు. దీనిపై అన్ని సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశ తేదీని, స్థలాన్ని ప్రభుత్వమే ముందుగా చెప్పాల్సి ఉందన్నారు. చట్టాలను రద్దు చేయడం తప్ప, మరిదేనినీ రైతులు అంగీకరించబోరని చెప్పారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిసారీ చర్చలకు రైతులు సుముఖత వ్యక్తం చేశారని అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ సమితి గుర్తుచేసింది. ప్రభుత్వమే మొండి వైఖరితో వ్యవహరిస్తోందని ఆల్​ ఇండియా కిసాన్​ సభ ఆరోపించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.