ETV Bharat / bharat

నేడే.. రైతుల బ్లాక్​ డే - రైతుల బ్లాక్​ డే

కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్​తో రైతులు ఆందోళనలు చేపట్టి ఆరు నెలలు అయిన వేళ అన్నదాతలు అందరూ నేడు బ్లాక్​ డే పాటించనున్నారు. నల్లజెండాలను ప్రతీ ఒక్కరూ ఎగురువేసి తమ అభీష్టాన్ని తెలపాలని సంయుక్త కిసాన్​ మోర్చ కోరింది.

black day
నేడే.. రైతుల బ్లాక్​ డే
author img

By

Published : May 26, 2021, 5:03 AM IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ దిల్లీ శివారుల్లో ఆందోళనలు చేపట్టి ఆరునెలలు పూర్తయిన సందర్భంగా బుధవారం రైతులు బ్లాక్​ డే పాటించనున్నారు. ఈ సందర్భంగా అందరూ నల్లజెండాలు ఎగురవేయాలని సంయక్త కిసాన్​ మోర్చ పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి ఎస్​కేఎం ఓ ప్రకటన విడుదల చేసింది. 'బుధవారం బుద్ధ పూర్ణిమ పర్వదినం సమాజంలో సత్యం, అహింసలు కరవవుతున్నాయి. ఈ ప్రధాన విలువల పునరుద్ధరణ పండగను జరుపుకోవాలని' కోరింది.

లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలి..

లాక్​డౌన్ నిబంధనలు పాటించాలని, ఎక్కడా గుంపులు చేరకూడదని రైతులకు దిల్లీ పోలుసులు సూచించారు. సరిహద్దుల్లో గస్తీ పెంచినట్లు తెలిపారు. దిల్లీలో కరోనా పరిస్థితుల దృష్ట్యా బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. కొవిడ్​ నిబంధనలకు విరుద్ధంగా రైతులు సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తుండడంపై దిల్లీ, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్​ నోటీసులు పంపించింది. ఆందోళనలు జరిగే చోట్ల కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకున్న చర్యలపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది.

ఇదీ చూడండి : రైతులకు మద్దతుగా సిద్ధూ ఇంటిపై నల్లజెండాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.