ETV Bharat / bharat

కేంద్రానికి రైతు సంఘాలు డెడ్​లైన్​! - పార్లమెంటులో సాగు చట్టాల రద్దు బిల్లు ఆమోదంపై రైతుల స్పందన

నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడం.. రైతులు సాధించిన విజయం అని పంజాబ్ రైతు నేతలు(Punjab farmer leaders) పేర్కొన్నారు. తమ డిమాండ్లపై స్పందించేందుకు కేంద్రానికి నవంబరు 30వరకు సమయం ఉందని చెప్పారు.

Farm Laws Repeal Bill passage in Parliament
పార్లమెంటులో సాగు చట్టాల రద్దు బిల్లుపై రైతులు
author img

By

Published : Nov 29, 2021, 6:21 PM IST

Updated : Nov 29, 2021, 7:25 PM IST

పార్లమెంటులో నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు(Farm laws Repeal Bill) ఆమోదం పొందడం.. రైతులు సాధించిన విజయం అని పంజాబ్​కు చెందిన రైతు సంఘాల నేతలు(Punjab farmer leaders) అభివర్ణించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. తదుపరి కార్యాచరణ కోసం డిసెంబరు 1న సంయుక్త కిసాన్ మోర్చా(Samyukta kisan morcha meeting) అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.

పంటలకు కనీస మద్దతు ధర, రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడం, ఉద్యమంలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడం సహా తమ ఆరు డిమాండ్లను కేంద్రం నెరవేర్చాలని రైతు సంఘాల నేతలు డిమాండ్​ చేశారు. తమ డిమాండ్లపై(Farmer demands to center) స్పందించేందుకు కేంద్రానికి మంగళవారం వరకు సమయం ఉందని చెప్పారు. ఈ మేరకు సింఘు సరిహద్దులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం..

హానికారకమైన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం మంచి చర్య అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. సాగు చట్టాల రద్దు బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం తాము వేచి చూస్తున్నామని చెప్పారు. అనంతరం.. వ్యవసాయ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులు, కనీస మద్దతు ధర, రైతులపై కేసుల కొట్టివేత వంటి అంశాలపై తాము చర్చిస్తామని తెలిపారు.

ఆందోళనల మధ్యే ఆమోదం..

విపక్షాల ఆందోళనల మధ్యే సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటు ద్వారా ముందుగా లోక్​సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం లభించింది.

ఇదీ చూడండి: 'సాగు చట్టాల రద్దు బిల్లు 750 మంది రైతులకు నివాళి'

Last Updated : Nov 29, 2021, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.