ETV Bharat / bharat

రైతు ఉద్యమం షహీన్​బాగ్​లా కాదు: టికాయిత్ - వ్యవసాయ చట్టాలు

రైతుల ఆందోళన షహీన్​బాగ్​ తరహాలా కాదన్నారు బీకేయూ నేత రాకేశ్ టికాయిత్. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఇంటికి వెళ్లేది లేదని ఉత్తర్​ప్రదేశ్​లోని కుండ్లీ సరిహద్దును 24 గంటలపాటు దిగ్బంధించిన సందర్భంగా ఈ విధంగా హెచ్చరించారు.

Farmers' protest not like Shaheen Bagh stir, says Rakesh Tikait
రైతు ఉద్యమం షహీన్​బాగ్​లా కాదు: టికాయిత్
author img

By

Published : Apr 11, 2021, 5:40 PM IST

రైతుల ఆందోళన షహీన్​బాగ్​ తరహా కాదనన్నారు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్. సాగు చట్టాలను రద్దుచేసే వరకు ఇంటికి తిరిగివెళ్లే ప్రసక్తే లేదని మరోమారు తేల్చిచెప్పారు. ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో కుండ్లీ-మానేసర్ ఎక్స్​ప్రెస్​ వేను 24 గంటలపాటు దిగ్బంధించిన సందర్భంగా ఈటీవీ భారత్​తో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈటీవీ భారత్​తో రాకేశ్ టికాయిత్

ఇంటికి వెళ్లేది లేదు..

"రాజస్థాన్​లో నాపై దాడి చేయించింది భాజపానే. రైతుల ఉద్యమాన్ని షహీన్​బాగ్​లా నీరుగార్చాలని అనుకుంటున్నారు. కొవిడ్​ను సాకుగా చూపుతున్నారు. కానీ మా పోరాటం షహీన్​బాగ్​ తరహాలా కాదు. సాగు చట్టాలను రద్దుచేసే వరకు ఇంటికి వెళ్లేది లేదు."--- రాకేశ్​ టికాయిత్​, బీకేయూ నేత
సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీ షహీన్​బాగ్​లో తీవ్ర స్థాయిలో ఆందళనలు చెలరేగాయి. కానీ గతేడాది మార్చి చివర్లో.. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ ప్రాంతం ఖాళీ అయిపోయింది.

కొవిడ్​ నిబంధనలను పాటించకపోవడంపై..

"బంగాల్​లో ఎవరు మాస్కులు ధరిస్తున్నారు? ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, మిగిలిన రాష్ట్రాల జాబితాను వేరుగా విడుదల చేస్తే అప్పుడు తెలుస్తుంది. మే 2న ఫలితాల తర్వాత కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతాయి." ---రాకేశ్​ టికాయిత్​, బీకేయూ నేత

పెద్ద కార్పొరేట్ సంస్థలు అన్నదాతలను లూటీ చేస్తున్నాయని టికాయిత్ విమర్శించారు. ప్రభుత్వం రైతుల డిమాండ్​లను తప్పక అంగీకరిస్తుందని పేర్కొన్నారు.

ఖట్టర్​ను అడ్డుకుంటాం..

ఈ నెల 14న బదౌలీ గ్రామంలో అంబేడ్కర్​ విగ్రహావిష్కరణకు రానున్న హరియాణా సీఎం మనోహర్​ లాల్​ అడ్డుకుంటామని టికాయిత్ హెచ్చరించారు. రైతుల ఐక్యతను దెబ్బతీసేందుకే ఖట్టర్​ వస్తున్నారని ఆయన ఆరోపించారు. అంబేడ్కర్​కు తాము వ్యతిరేకం కాదని, మరెవరైనా విగ్రహావిష్కరణ చేయొచ్చని చెప్పారు.

ఇదీ చూడండి: త్రివర్ణాలతో రైతుల వెదురు గుడిసెలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.