ETV Bharat / bharat

దిల్లీలో మళ్లీ రైతుల నిరసన, భారీగా ట్రాఫిక్​ జాం

Farmers protest in Delhi దేశ రాజధానిలో మరోసారి రైతుల ఆందోళనలు చేపట్టారు. నిరుద్యోగం సహా పలు సమస్యలపై దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద అన్నదాతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా మహాపంచాయత్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి అన్నదాతలు దిల్లీకి చేరుకున్నారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో దిల్లీ సహా సరిహద్దుల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

farmers protest
farmers protest
author img

By

Published : Aug 22, 2022, 12:45 PM IST

Farmers protest jantar mantar: రైతుల నిరసనలకు దేశ రాజధాని మరోసారి వేదికైంది. రైతు చట్టాల ఉపసంహరణ కోసం గతేడాది దిల్లీ, సరిహద్దు ప్రాంతాల్లో నిరసనల్లో పాల్గొన్న రైతులు.. మరోసారి నగర బాటపట్టారు. నిరుద్యోగ సమస్య, తమ మునుపటి సమస్యల పరిష్కారం కోసం జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తోన్న మహా పంచాయత్‌లో పాల్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి వందల మంది అన్నదాతలు దేశ రాజధానికి చేరుకున్నారు. జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుత ఆందోళనలు చేస్తున్నారు.

farmers protest
ఆందోళనలకు వస్తున్న రైతులు
farmers protest
దిల్లీ సరిహద్దులో ట్రాఫిక్​ జాం

జంతర్‌మంతర్‌ వద్ద మహాపంచాయత్‌ నేపథ్యంలో దేశ రాజధానిలో దిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్నదాతల ఆందోళనల దృష్ట్యా దిల్లీలో 144 సెక్షన్ విధించారు. దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. గాజీపూర్, సింఘూ, టిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి.. దిల్లీలోకి వస్తున్న అన్ని వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. గాజీపూర్‌ సరిహద్దుల్లో దిల్లీ-మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై నిఘాను పటిష్ఠం చేశారు. దీంతో దిల్లీ సరిహద్దుల్లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్‌ జాం అయింది.

farmers protest
భారీగా మోహరించిన పోలీసు బలగాలు
farmers protest
వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

ఆందోళనల్లో పాల్గొనకుండా రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం దిల్లీకి వస్తున్న రాకేశ్‌ను గాజీపూర్‌ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకుని మధువిహార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దిల్లీలోని నిరుద్యోగ యువతను కలుసుకోనివ్వకుండా దిల్లీ పోలీసులు కేంద్రం కనుసన్నల్లో నడుచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

ఇవీ చదవండి: భాజపాలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తామంటూ ఆఫర్​ ఇచ్చారన్న సిసోదియా

వారిని టార్గెట్ చేస్తూ దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, కేంద్రంపై గవర్నర్​ ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.