ఎన్నికల్లో తిరస్కరణకు గురైన వారు.. ఇప్పుడు ప్రచారం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని ఆరోపించారు ప్రధాని మోదీ. అలాంటి వారి మాయలో పడొద్దని ప్రజలకు సూచించారు. దీర్ఘకాలంగా కేరళను పాలించిన వారు పంజాబ్ రైతులకు మద్దతు తెలుపుతున్నారు కానీ, సొంత రాష్ట్రంలో మండీల ఏర్పాటుకు చేసిందేమీలేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దేశంలోని 80 శాతం మంది రైతులు నిరుపేదలుగా మారారని, వారి కోసం వ్యవసాయ సంస్కరణలు అవసరమన్నారు. తమ ప్రభుత్వం మరిన్ని పంటలను కనీస మద్దతు ధర పరిధిలోకి తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు.
" మండీలు, ఏపీఎంసీల గురించి మాట్లాడుతున్న వారే బంగాల్, కేరళను నాశనం చేశారు. కేరళలో ఏపీఎంసీలు, మండీలు లేవు. మరి కేరళలో నిరసనలు ఎందుకు లేవు? అక్కడ వారు ఉద్యమాలు ఎందుకు ప్రారంభించలేదు? కానీ..వారు పంజాబ్ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి