ETV Bharat / bharat

రైతు సంఘాలతో చర్చపై కేంద్రం ప్రకటన విడుదల - నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల దీక్ష

delhi
రైతు దీక్ష: సాగు చట్టాలపై అన్నదాతల పోరు
author img

By

Published : Dec 1, 2020, 8:05 AM IST

Updated : Dec 1, 2020, 10:00 PM IST

21:56 December 01

రైతులతో చర్చపై కేంద్రం ప్రకటన విడుదల..

  • రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చలపై ప్రకటన విడుదల చేసిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ.
  • రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, వ్యవసాయ అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రైతు సంఘాల ప్రతినిధులకు చెప్పిన కేంద్ర మంత్రులు.
  • పరస్పర అంగీకారంతో రైతుల సమస్యలను పరిష్కరించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ప్రభుత్వం. 
  • ఈ విషయంపై.. స్నేహపూర్వకంగా పరిష్కరించడానికి ప్రభుత్వంతో మరోసారి చర్చలకు హాజరుకావాలని సూచన వచ్చింది: వ్యవసాయ శాఖ
  • పరస్పర చర్చల్లో.. వ్యవసాయ సంస్కరణ చట్టాలకు సంబంధించిన నిర్దిష్ట సమస్యలను గుర్తించి, పరిశీలన కోసం రేపు సాయంత్రంలోపు ప్రభుత్వానికి ఇవ్వాలని రైతు సంఘాల నేతలను కోరిన ప్రభుత్వం. 
  • ఈనెల 3న జరిగే.. సమావేశంలో రైతు సంఘాలు లేవనెత్తిన అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం. 
  • రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, రైతుల సంక్షేమం కోసం చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చిన మంత్రులు

21:24 December 01

వ్యవసాయ చట్టాల అంశంలో తమకు ఉన్న సమస్యలపై రేపు ముసాయిదా సమర్పిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేశ్ టికైత్ తెలిపారు. పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, హరియాణా, దిల్లీ రైతులతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించిందని చెప్పారు. డిసెంబర్ 3న తర్వాతి సమావేశం జరిగేవరకు తాము లేవనెత్తిన సమస్యలపై ఆలోచించడానికి ప్రభుత్వానికి సమయం ఉందని పేర్కొన్నారు.

20:31 December 01

రైతు నాయకులతో కేంద్ర మంత్రుల భేటీ

రైతు సంఘాలతో చర్చల అనంతరం.. హరియాణా, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన అన్నదాతలతో కృషి భవన్​లో సమావేశమయ్యారు కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్​. భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధులు కూడా భేటీకి హాజరయ్యారు.

19:18 December 01

భారతీయ కిసాన్​ యూనియన్​తో మరోమారు చర్చలు..

రైతు సంఘాలతో చర్చలు అసంపూర్తిగా ముగిసిన అనంతరం.. భారతీయ కిసాన్​ యూనియన్​(బీకేయూ)తో మరోసారి సమావేశమైంది కేంద్రం.  

19:00 December 01

అసంపూర్తిగా ముగిసిన చర్చలు..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తిన రైతులతో హస్తినలో కేంద్ర మంత్రుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమైన కేంద్ర మంత్రుల బృందం రెండున్నర గంటలకుపైగా వారి డిమాండ్లపై చర్చించారు. రైతుల సంఘాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేద్దామని మంత్రులు ప్రతిపాదించగా రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈనెల 3న మరోసారి భేటీకావాలని నిర్ణయించారు. అప్పటి వరకూ ఆందోళన కొనసాగుతుందని  రైతులు స్పష్టం చేశారు. 

18:45 December 01

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈనెల 3న మరోమారు సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

17:54 December 01

రైతులతో కొనసాగుతున్న చర్చలు..

  • విజ్ఞాన్ భవన్ లో రైతు సంఘాల నేతలతో కొనసాగుతున్న కేంద్రం చర్చలు
  • కనీస మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టాలను రైతు సంఘాల నేతలకు విస్తరిస్తున్న కేంద్రం
  • కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు అంగీకరించిన మంత్రులు
  • నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రతిపాదన
  • కమిటీ సభ్యులుగా రైతు సంఘాల నుంచి ఐదుగురు పేర్లను సూచించాలన్న కేంద్రం
  • వ్యవసాయ చట్టాల రద్దు, పంటలకు మద్దతు ధరకు చట్టబద్దత, విద్యుత్ సవరణ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాలు
  • పంజాబ్ రైతు సంఘాలతో భేటీ తర్వాత యూపీ, ఉత్తరాఖండ్, హర్యానా, దిల్లీ రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపే అవకాశం

17:21 December 01

రైతులకు కేంద్రం ప్రతిపాదన..

రైతు సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్న కేంద్రం వారి ముందు ఒక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాల నుంచి నలుగురు లేదా ఐదుగురితో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కోరింది. అదే విధంగా కేంద్రం నుంచి కొంతమంది సభ్యులు సహా వ్యవసాయ రంగం నిపుణులు కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చిస్తారని స్పష్టం చేసింది. విజ్ఞాన్​ భవన్​లో ఇరు పక్షాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. 

17:07 December 01

కనీస మద్దతు ధరపై కేంద్రం వివరణ..

దిల్లీ విజ్ఞాన్​ భవన్​లో రైతు సంఘాల నేతలతో సమావేశమైంది కేంద్రం. కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ), అగ్రికల్చరల్​ ప్రొడ్యూస్​ మార్కెట్​ యాక్ట్​(ఏపీఎంసీ)పై కూలంకషంగా వివరించింది కేంద్రం. కేంద్ర మంత్రులు పీయూష్​ గోయల్​, సోమ్​ ప్రకాశ్​, నరేంద్ర సింగ్​ తోమర్​.. రైతులతో చర్చలు జరుపుతున్నారు. 

15:34 December 01

రైతుసంఘాలు, కేంద్రప్రభుత్వం మధ్య చర్చలు ప్రారంభం

  • దిల్లీ: విజ్ఞాన్‌భవన్‌లో కేంద్రమంత్రుల బృందం, రైతుల మధ్య చర్చలు
  • కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతుల డిమాండ్
  • రైతుల ఆందోళనతో ముందస్తు చర్చలకు ఆహ్వానించిన కేంద్రం

15:26 December 01

రైతులతో చర్చకు ముగ్గురు కేంద్రమంత్రులు..

రైతు సంఘాలతో జరగనున్న చర్చలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్​ తోమర్​ సహా పీయూష్​ గోయల్​, సోమ్​ ప్రకాశ్​ పాల్గొననున్నారు. రైతుల కచ్చితమైన డిమాండ్లను బట్టి .. సమస్యలకు పరిష్కారం చూపిస్తామని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తోమర్​. ఆయన ఇప్పుడే దిల్లీ విజ్ఞాన్​ భవన్​కు చేరుకున్నారు. 

15:08 December 01

విజ్ఞాన్​ భవన్​కు రైతు సంఘాల నేతలు- కేంద్రంతో చర్చలు

కేంద్ర వ్వవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ చర్చలకు ఆహ్వానించగా.. దిల్లీ విజ్ఞాన్​ భవన్​కు చేరుకుంటున్నారు రైతు సంఘాల నేతలు. రైతు సమస్యలపై పరిష్కారం కోసం .. వారితో కేంద్రం చర్చలు జరపనుంది. 

  • చర్చలకు హాజరైన భారతీయ కిసాన్ యూనియన్
  • గైర్హాజరైన పంజాబ్ కిసాన్ సంఘర్ష్ కమిటీ, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ
  • డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళన కొనసాగిస్తామన్న రైతు సంఘాలు
  • కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా 6 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతులు

14:57 December 01

స్పందించిన విదేశాంగ శాఖ..

భారత్​లో రైతులకు సంబంధించి కెనడా నాయకులు చేసిన వ్యాఖ్యలను కేంద్ర విదేశాంగ శాఖ తప్పుబట్టింది. ఆ వ్యాఖ్యలు అనవసరమైనవని.. ఒక ప్రజాస్వామ్య దేశంలోని అంతర్గత వ్యవహారాలపై స్పందించడం అర్థరహితమని తెలిపారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాత్సవ. 

14:40 December 01

రైతుల ధర్నాకు కెనడా ప్రధాని మద్దతు..

పంజాబ్​, హరియాణా సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల నిరసనలపై ఆందోళన వ్యక్తం చేశారు కెనడా ప్రధాని జస్టిన్​ ట్రుడో. రైతుల శాంతియుత నిరసనలకు తమ దేశం ఎప్పుడూ అడ్డు చెప్పదని అన్నారు.

భారత్​లో వ్యవసాయ చట్టాలపై స్పందించిన తొలి ప్రపంచ నేతగా నిలిచారు ట్రుడో. 

గురునానక్​ జయంతి సందర్భంగా కెనడాలోని భారత కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడిన ట్రుడో.. ఈ వ్యాఖ్యలు చేశారు. 

12:59 December 01

  • Delhi: Union Agriculture Minister Narendra Singh Tomar leaves from the residence of BJP President JP Nadda

    A meeting over farmers' protest was being held at the BJP President's residence pic.twitter.com/PXDApyve0A

    — ANI (@ANI) December 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ముగిసిన భేటీ...

రైతు నిరసనల నేపథ్యంలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన కేంద్ర మంత్రుల భేటీ ముగిసింది. కేంద్రమంత్రులు రాజ్​నాథ్​, అమిత్​ షా, నరేంద్ర సింగ్​ తోమర్​లు.. నడ్డా నివాసం నుంచి బయలుదేరారు.

ఈరోజు మధ్యాహ్నం.. రైతులతో కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

12:45 December 01

చర్చల్లో పాల్గొంటాం..

చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఇచ్చిన పిలుపును పంజాబ్​ కిసాన్​ యూనియన్​ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ మన్సా స్వాగతించారు. మధ్యాహ్నం 3గంటలకు భేటీకి హాజరవుతానని పేర్కొన్నారు.

12:08 December 01

డిమాండ్లు వినాలి..

రైతుల డిమాండ్లను ప్రభుత్వం వినాలని నటుడు, మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​ హాసన్​ కోరారు. అంత పెద్ద ఎత్తున వారు నిరసన చేస్తున్నప్పుడు వారి గళాన్ని వినాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంటుందని కమల్​ హాసన్​ తెలిపారు.

11:25 December 01

  • Delhi: Union Home Minister Amit Shah and Agriculture Minister Narendra Singh Tomar arrive at the residence of BJP President JP Nadda, to hold a meeting over farmers protest pic.twitter.com/ZZriac7vE5

మరోసారి..

రైతు ఉద్యమంపై చర్చించేందుకు మరోసారి కేంద్రం సిద్ధమైంది. కేంద్రమంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్​ ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో భేటీ అయ్యారు.

11:05 December 01

చర్చలకు ఆహ్వానం..

రైతు సంఘాల నాయకులను ఈరోజు మధ్యాహన్నం 3 గంటలకు చర్చలకు ఆహ్వానించాం. రైతులతో మాట్లాడాటానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 

   - నరేంద్ర సింగ్​ తోమర్, కేంద్ర వ్యవసాయ మంత్రి

10:52 December 01

ఉద్రిక్తం..

ఘజిపుర్​-ఘజియాబాద్​ సరిహద్దు వద్ద నిరసన చేస్తోన్న రైతులు బారీకేడ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాక్టర్లతో బారీకేడ్లను పక్కకు జరుపుతున్నారు.

10:35 December 01

దిల్లీ ఆటోరిక్షా, ట్యాక్సీ సంఘాల మద్దతు..

సాగు చట్టాలపై రైతులు చేస్తోన్న ఉద్యమానికి దిల్లీ ఆటోరిక్షా, ట్యాక్సీ యూనియన్లు మద్దతు తెలిపాయి. అయితే గతంలో లాక్​డౌన్​ కారణంగా పని లేకపోవడం వల్ల ప్రస్తుతం సమ్మె చేయలేమని స్పష్టం చేశాయి.

10:33 December 01

టిక్రి సరిహద్దును మూసివేశారు అధికారులు. హరియాణాకు వెళ్లేందుకు మిగిలిన సరిహద్దులు తెరిచి ఉన్నట్లు స్పష్టం చేశారు. రైతులు నిరసన వ్యక్తం చేస్తోన్న తరుణంలో పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

09:01 December 01

మంత్రికి నిరసన సెగ..

హరియాణాలోనూ రైతుల నిరసన ఉద్ధృతంగా సాగుతోంది. నిన్న గురునానక్​ జయంతి సందర్భంగా ప్రార్థనల కోసం అంబాలాలోని గురుద్వారాకు వచ్చిన రాష్ట్ర మంత్రి అనిల్​ విజ్​కు నిరసన సెగ తగిలింది. రైతులు ఆయనకు నల్ల జెండాలు చూపించి.. 'కిసాన్​ ఏక్తా జిందాబాద్'​ అంటూ నినాదాలు చేశారు.

07:50 December 01

రైతు దీక్ష: సాగు చట్టాలపై అన్నదాతల పోరు

  • There are more than 500 groups of farmers in the country, but the Govt has invited only 32 groups for talks. The rest haven't been called by the govt. We won't be going for talks till all groups are called: Sukhvinder S Sabhran, Jt Secy, Punjab Kisan Sangarsh Committee in Delhi pic.twitter.com/jYGQlEMKSk

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన కొనసాగుతోంది. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినప్పటికీ రైతన్నలు అందుకు ఒప్పుకోలేదు. షరతులతో కూడిన చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

"దేశంలో 500కు పైగా రైతు సంఘాలు ఉన్నాయి. ప్రభుత్వం కేవలం 32 బృందాలనే చర్చలకు పిలిచింది. మిగిలిన వారిని ఆహ్వానించలేదు. అందరినీ పిలిచేవరకు మేము చర్చలకు వెళ్లం."

   - సుఖ్​విందర్​, పంజాబ్​ కిసాన్​ సంఘర్ష్​ కమిటీ జాయింట్​ సెక్రటరీ

Last Updated : Dec 1, 2020, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.