ETV Bharat / bharat

'రైతుల దృఢ సంకల్పానికి సాక్ష్యం ఈ ఉద్యమం' - new agri laws

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం(Farmers Protest).. వారి దృఢ సంకల్పానికి సాక్ష్యమని సంయుక్త కిసాన్​ మోర్చా పేర్కొంది. రైతుల ఆందోళనలు చేపట్టి, 300 రోజులు పూర్తైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 27న పిలుపునిచ్చిన దేశవ్యాప్త బంద్​కు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది.

Farmers' protest
రైతుల నిరసనలు
author img

By

Published : Sep 23, 2021, 5:42 AM IST

కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలకు(Farmers Protest) బుధవారంతో 300 రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎం) కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని లక్షలాది మంది రైతుల సంకల్పానికి ఈ ఉద్యమం(Farmers Protest) సాక్ష్యంగా నిలిచిందని పేర్కొంది. రానున్న రోజుల్లో ఇది మరింత బలోపేతం అవుతుందని చెప్పింది.

"దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన చేపట్టి మూడు వందల రోజులు పూర్తయ్యాయి. దేశ వ్యవసాయ రంగాన్ని హస్తగతం చేసుకోవడానికి చూస్తున్న కార్పొరేట్​ సంస్థలకు వ్యతిరేకంగా.. రైతులు శాంతియుతంగా పోరాడుతున్నారు. వారి డిమాండ్లు ఏంటో మోదీ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. దేశంలో అధిక సంఖ్యలో ఉన్న రైతులు వేసిన ఓట్ల ద్వారా గెలిచిన ప్రభుత్వం.. వాటిని అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తోంది."

- సంయుక్త కిసాన్​ మోర్చా.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఆందోళనలను మరింత విస్తృతం చేస్తామని ఎస్​కేఎం పేర్కొంది. సెప్టెంబర్​ 27న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త బంద్​కు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది.

కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు.. రైతులు నిర్వహించ తలపెట్టిన బంద్​లో పాల్గొంటాయని ఎస్​కేఎం తెలిపింది. బంద్​లో భాగంగా కిసాన్ మహా పంచాయత్​లు కూడా నిర్వహించనున్నట్లు చెప్పింది. సైకిల్​, బైక్​ ర్యాలీలు కూడా కొనసాగుతాయని పేర్కొంది.

ఇదీ చూడండి: rakesh tikait: 'రాకేశ్‌ టికాయిత్‌.. బందిపోటు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.