ETV Bharat / bharat

టికాయిత్​కు బెదిరింపు.. అదుపులోకి నిందితుడు

రైతు నాయకుడు రాకేశ్​ టికాయిత్​ను చంపేస్తానంటూ ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి హల్​చల్​ చేశాడు. ఈ విషయాన్ని నేరుగా పోలీసులకే తెలిపాడు. వెంటన్నే అప్రమత్తమైన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

tikait
టికాయిత్​కు బెదిరింపు.. అదుపులోకి నిందితుడు
author img

By

Published : Mar 6, 2021, 11:04 PM IST

భారతీయ​ కిసాన్​ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్​ను హత్య చేస్తానంటూ ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని నేరుగా పోలీస్​ కంట్రోల్​ రూమ్​కి ఫోన్​ చేసి చెప్పడం గమనార్హం. ఈ ఘటన దిల్లీలోని కమలా మార్కెట్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది.

ఇదీ జరిగింది..

కమలా మార్కెట్​ ప్రాంతంలో టీ అమ్ముకొని నివసించే నిందితుడు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫోన్​ చేశాడు. రైతు నేత రాకేశ్​ టికాయిత్​ను చంపేస్తానంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు కాల్​ను ట్రాక్​ చేయగా.. అతను కమలా మార్కెట్​ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాడని గుర్తించారు. వెంటనే ఆ ప్రాంత పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మత్తులో..

నిందితుడిని దర్యాప్తు చేసిన పోలీసులు.. అతను విపరీతంగా మద్యం సేవించాడని తెలిపారు. తాగిన మత్తులో అతను ఈ వ్యాఖ్యలు చేశాడని.. వాస్తవానికి అతనికి హత్య చేయాలన్న ఉద్దేశం లేదని పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని వదిలేశారు.

ఇదీ చదవండి : అక్రమంగా తరలిస్తున్న 15కిలోల బంగారం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.