నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు నాలుగో రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన నిరంకారి మైదానానికి వెళ్లేందుకు వారు నిరాకరిస్తున్నారు. ఉదయం 11 గంటలకు సింఘు సరిహద్దు వద్ద సమావేశమై కార్యాచరణ రూపొందిస్తామని రైతులు తెలిపారు.
రైతులతో చర్చలకు సిద్ధమని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. రైతుల ఆందోళనపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. అయితే ఆందోళన విరమించేందుకు రైతులు నిరాకరిస్తున్నారు.
రైతుల ఆందోళనల నేపథ్యంలో సింఘు సరిహద్దలో పోలీసులు భారీగ మోహరించారు. ముందు జాగ్రత్తగా బారీకేడ్లు ఏర్పాటు చేశారు.