ETV Bharat / bharat

చక్కాజామ్ ప్రశాంతం-పుణె, దిల్లీలో స్వల్ప ఉద్రిక్తత - farm laws

Farmer unions on Monday had announced countrywide 'chakka jam' on February 6 when they would block national and state highways between 12 pm and 3 pm to protest the internet ban in areas near their agitation sites, harassment allegedly meted out to them by authorities and other issues.

Farmers stir: Police on high alert ahead of 'Chakka Jam'
పటిష్ఠ భద్రతా వలయంలో దిల్లీ
author img

By

Published : Feb 6, 2021, 9:59 AM IST

Updated : Feb 6, 2021, 4:37 PM IST

16:36 February 06

చక్కాజామ్ ప్రశాంతం-పుణె, దిల్లీలో స్వల్ప ఉద్రిక్తత

అక్టోబర్ రెండో తేదీలోగా సాగుచట్టాలను రద్దుచేయాలని రైతుసంఘాలు కేంద్రానికి  

గడువు విధించాయి. డిమాండ్లు నెరవేరే వరకూ దేశ రాజధానిని వదిలివెళ్లేది లేదని తేల్చిచెప్పాయి. చక్కాజామ్ పేరిట  రైతుసంఘాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త రాస్తారోకో ప్రశాంతంగా ముగిసినట్లు ప్రకటించాయి.

బెంగళూరు, పుణె, దిల్లీలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

15:27 February 06

మా డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఇంటికి వెళ్లం

  • మా డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఇంటికి వెళ్లం: రాకేశ్ టికాయిత్​‌
  • వ్యాపారం చేసుకునేందుకు మా పొలాలు ఇవ్వబోం: రాకేశ్ టికాయిత్​
  • గాంధీ జయంతి వరకు ఇక్కడే ఆందోళన కొనసాగిస్తాం: రాకేశ్ టికాయిత్​‌
  • సర్కారు దిగొచ్చే వరకు ధర్నాలు కొనసాగుతాయి: రాకేశ్ టికాయిత్​
  • సాగు చట్టాల రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు: రాకేశ్ టికాయిత్​‌

14:24 February 06

  • Delhi: Personnel of Security Forces including that of Rapid Action Force deployed at Ghazipur border (Delhi-Uttar Pradesh).

    Around 50,000 personnel of Delhi Police, Paramilitary & Reserve Forces have been deployed in Delhi-NCR region, as per Delhi Police. pic.twitter.com/PBZleWSQOY

    — ANI (@ANI) February 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

50 వేల మంది బలగాలు..

దిల్లీ-ఎన్​సీఆర్​ సరిహద్దుల్లో దాదాపు 50 వేల మంది పోలీసు, పారామిలిటరీ సిబ్బంది మోహరించారు. 

14:21 February 06

గాజీపుర్​ సరిహద్దు వద్ద భారీగా బలగాలు..

చక్కా జామ్​ నేపథ్యంలో.. దిల్లీ పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. దిల్లీ-ఉత్తర్​ప్రదేశ్​ ప్రాంతంలోని గాజీపుర్​ సరిహద్దు వద్ద భారీగా బలగాలను మోహరించింది. నిరసనకారులు దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా.. బారికేడ్లు, ఇనుప కంచెలను రోడ్లపై ఏర్పాటు చేసింది.

14:19 February 06

  • Delhi: Police detain the protesters in Shahidi Park area who were protesting against farm laws as part of the countrywide 'chakka jaam' called by farmers today pic.twitter.com/TS3GNlPJoY

దిల్లీలో నిర్బంధం..

దిల్లీ షాహిదీ పార్క్​ ప్రాంతం వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా చక్కా జామ్​ నిర్వహిస్తున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలో చక్కా జామ్​ నిర్వహించబోమని రైతు సంఘాలు ప్రకటించిన నేపథ్యంలోనే వారిని నిర్బంధించారు. 

13:14 February 06

కట్టుదిట్టం

రైతుల రాస్తా రోకో నేపథ్యంలో యూపీ పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర, జాతీయ రహదారుల వెంబడి 6 పారామిలిటరీ కంపెనీలు, 144 యూపీ-పీఏసీ కంపెనీల సిబ్బందిని మోహరించినట్లు రాష్ట్ర అదనపు డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కదలికను రికార్డు చేస్తున్నట్లు వెల్లడించారు.

12:50 February 06

జమ్ము కశ్మీర్ సంఘాల మద్దతు

దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన చక్కా జామ్(రాస్తారోకో)కు మద్దతుగా జమ్ము కశ్మీర్​లో నిరసనలు జరిగాయి. అక్కడి రైతు సంఘాలు రోడ్లపై బైఠాయించి నినాదాలు చేశాయి. దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్న రైతులకు తమ మద్దతు ఉంటుందని నిరసనకారులు స్పష్టం చేశారు. సాగు చట్టాలను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

హరియాణా అతోహాన్ చౌక్ వద్ద రైతులు చక్కా జామ్ నిర్వహించారు.

12:33 February 06

'వీధుల్లోకి రండి.. ధర్నా చేయండి'

సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ప్రజలందరినీ వీధుల్లోకి రావాలని కోరారు కాంగ్రెస్​ నేత దిగ్విజయ్​ సింగ్​. ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

12:27 February 06

  • Bengaluru: Police detain the protesters who were agitating outside Yelahanka Police Station against the farm laws as part of the countrywide 'chakka jaam' called by farmers today.

    #Karnataka pic.twitter.com/NQz9WlmC21

రైతుల నిర్బంధం..

బెంగళూరు యలహంక పోలీస్​ స్టేషన్​ ఎదుట నిరసనలు చేస్తున్న రైతులను నిర్బంధించారు పోలీసులు. నిరసనకారులను బస్సుల్లో తరలించారు. 

12:18 February 06

పంజాబ్​లో రైతులు..

దేశవ్యాప్తంగా రాస్తారోకోలో భాగంగా.. పంజాబ్​లో రైతులు రోడ్లను దిగ్బంధించారు. అమృత్​సర్​, మొహలీ వంటి ప్రధాన నగరాల్లో రోడ్లపై బైఠాయించి నిరసనలు చేస్తున్నారు రైతులు. 

12:16 February 06

షాజహాన్​పుర్​ హైవే దిగ్బంధం..

రాజస్థాన్​-హరియాణా సరిహద్దులోని షాజహాన్​పుర్​ జాతీయ రహదారిని దిగ్బంధించారు రైతులు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు నిరసనకారులు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

12:03 February 06

మెట్రో స్టేషన్లు మూసివేత..

  • దేశ రాజధాని దిల్లీ మెట్రో స్టేషన్లలో హైఅలర్ట్
  • రైతుల 'చక్కా జామ్' దృష్ట్యా 12 మెట్రో స్టేషన్లలో హైఅలర్ట్
  • ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలపై పోలీసుల నిరంతర నిఘా
  • మండీ హౌస్, ఐటీవో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు మూసివేత
  • దిల్లీ గేట్, విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేత
  • లాల్‌ఖిలా, జామా మసీదు మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేత
  • జన్‌పథ్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేత
  • ఖాన్ మార్కెట్, నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేత
  • శాంతిభద్రతల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తున్న పోలీసులు

12:03 February 06

రైతు సంఘాల రాస్తారోకో..

  • దేశవ్యాప్తంగా రైతు సంఘాల రాస్తారోకో
  • సాగు చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా రాస్తారోకో
  • 'చక్కా జామ్' పేరుతో రహదారుల దిగ్బంధం
  • మధ్యాహ్నం 3 గంటల వరకు రహదారుల దిగ్బంధం
  • రైతు సంఘాల చక్కా జామ్‌కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌
  • రైతుల 'చక్కా జామ్‌' దృష్ట్యా అప్రమత్తమైన దిల్లీ పోలీసులు
  • ఎర్రకోట సహా వివిధ ప్రాంతాల్లో భారీగా బలగాల మోహరింపు
  • దిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌లో 50 వేలమంది భద్రతా సిబ్బంది మోహరింపు

11:21 February 06

పునరావృతం కానివ్వం..

చక్కా జామ్​ నేపథ్యంలో.. జనవరి 26న జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని దిల్లీ సీపీ ఆలోక్​ కుమార్​ తెలిపారు. దేశ రాజధానిలో భద్రతను పర్యవేక్షించడానికి డ్రోన్లను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో సీసీటీవీలు అమర్చినట్లు స్పష్టం చేశారు.  

11:16 February 06

'పంజాబ్​ మాత్రమే కాదు. దేశమంతా'

రైతు నిరసనలు ఒక్క రాష్ట్రానికే పరిమితం అయ్యాయన్న కేంద్రం వ్యాఖ్యలపై స్పందించారు శిరోమణి అకాలీదళ్​ నేత హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​. పంజాబ్​లో మాత్రమే నిరసనలు చేస్తున్నారని ప్రభుత్వం అపార్థం చేసుకుంటోందని బదులిచ్చారు. 

'' పంజాబ్​ రైతులు మాత్రమే నిరసనలు చేస్తున్నారని ప్రభుత్వం తప్పుగా అనుకుంటోంది. దేశమంతా నిరసనలు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల ప్రజలు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.''

          - హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​, ఎస్​ఏడీ నాయకురాలు

11:08 February 06

మరో నాలుగు మెట్రో స్టేషన్లు మూసివేత..

లాల్​ ఖిలా, జామా మసీదు, జన్​పథ్​, సెంట్రల్​ సెక్రటేరియట్​ మెట్రో స్టేషన్లను కూడా మూసివేశారు.

10:42 February 06

మెట్రో స్టేషన్లు మూసివేత..

చక్కా జామ్​ నేపథ్యంలో.. మండీ హౌస్​, ఐటీఓ, దిల్లీ గేట్, విశ్వవిద్యాలయ​ మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఈ మేరకు దిల్లీ మెట్రో రైల్​ కార్పొరేషన్​ ఓ ప్రకటన వెలువరించింది. 

10:08 February 06

శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న డ్రోన్లు

డ్రోన్లతో పర్యవేక్షణ..

దిల్లీలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు పోలీసులు. 

10:06 February 06

బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు

ఇనుప కంచెలు, బారికేడ్లు..

నిరసనకారులను అడ్డుకునేందుకు దిల్లీ సరిహద్దుల్లో భారీగా బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాట్లు చేశారు. పరిస్థితి చేయిదాటితే చెదరగొట్టేందుకు నీళ్ల ట్యాంకర్లు, జల ఫిరంగులు అందుబాటులో ఉంచుకున్నారు.  

10:05 February 06

అదనపు బలగాలు మోహరింపు

అదనపు బలగాలు..

చక్కా జామ్​ నేపథ్యంలో.. దిల్లీ సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు. దాదాపు 50 వేల మంది పారామిలిటరీ, రిజర్వు బలగాలు పహారా కాస్తున్నాయి. 

09:48 February 06

లైవ్​ అప్​డేట్స్​: పటిష్ఠ భద్రతా వలయంలో దిల్లీ

సాగు చట్టాలను రద్దుచేసే వరకూ విశ్రమించేది లేదంటూ ఉద్యమిస్తున్న అన్నదాతలు.. నేడు దేశవ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రహదారులను.. దిగ్బంధం చేయనున్నారు. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లకు మినహా.. దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఆందోళన చేపట్టనున్నారు. రాస్తారోకోలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశరాజధాని దిల్లీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దాదాపు 50 వేల మంది పోలీసు, పారామిలిటరీ, రిజర్వు బలగాలను మోహరించారు. 

Last Updated : Feb 6, 2021, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.