ఎవరైన హత్యకు గురైతే.. హంతకులను కఠినంగా శిక్షించాలని వారి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయిస్తారు. త్వరగా పట్టుకోవాలని ఉన్నతాధికారులను వేడుకుంటారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌కు చెందిన ఓ రైతు.. మరో అడుగు ముందుకేసి తన భార్యను చంపిన వ్యక్తి తలపై రివార్డు ప్రకటించాడు. అధికారుల తీరుపై విసుగెత్తిన ఆ రైతు.. తన ఆర్థిక స్తోమత సరిగా లేకపోయినా హంతకులను ఎలాగైనా పట్టుకోవాలని కంకణం కట్టుకున్నాడు.
ఇదీ జరిగింది..
జులై 8న నివారీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షేర్పుర్ గ్రామంలో పవిత్ర అనే మహిళను.. రోహిత్, అతని అనుచరుడు అభిషేక్ కాల్చి చంపారు. ప్రేమ పేరుతో వేధిస్తూ.. తన మరదలిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిచంగా.. వారిని అడ్డుకుంది పవిత్ర. అడ్డుకున్నందుకు ఆమెపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసి ఎన్నో రోజులు గడుస్తున్నా నిందితులను పట్టుకోవటంలో పోలీసులు విఫలమయ్యారు. విసుగెత్తిన ఆమె భర్త.. తానే నిందితులను పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తన భార్యను చంపిన వారి ఆచూకీ చెప్పిన వారికి రూ. 20వేల రివార్డు ఇస్తానని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు ఆ రైతు.
భార్య మరణంతో దిగ్భ్రాంతికి గురై రైతు.. ఆహారం తీసుకోవటం లేదని, ఎవరితోనూ మాట్లాడకుండా పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి: 'నిన్నటి కేసు ఇవాళ పెండింగ్ అవుతుందా?'