ETV Bharat / bharat

Chandrababu's Health in Jail : జైలులో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన - చంద్రబాబు విశేషాలు

Family_members_worried_about_Chandrababu_health

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 11:55 AM IST

Updated : Oct 13, 2023, 8:33 PM IST

11:51 October 13

ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారు: భువనేశ్వరి, బ్రాహ్మణి

Chandrababu's Health in Jail : జైలులో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన

Family Members are Worried About Chandrababu's Health : రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో అపరిశుభ్ర పరిసరాల వల్ల చంద్రబాబు ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ట్వీట్‌ చేశారు. తన భర్త చంద్రబాబుకు అవసరమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త క్షేమం గురించి చాలా ఆందోళనగా ఉన్నట్లు భువనేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబు ఇప్పటికే 5 కేజీల బరువు తగ్గారని, ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారని తెలిపారు. జైల్లో అపరిశుభ్ర వాతావరణం, అపరిశుభ్రమైన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు ఉన్నాయని... ఆ నీళ్ల వినియోగంతో చంద్రబాబు ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నట్లు కోడలు నారా బ్రాహ్మణి ట్వీట్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులంతా తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు చెప్పారు. ఆయనకు అత్యవసరంగా వైద్యం అందించాలని కోరారు.

Anticipatory Bail for Chandrababu in Angallu Case: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు

భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.. చంద్రబాబు పై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఆరోపించారు. ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు కి ఏదైనా హాని జరిగితే, అందుకు జగన్మోహన్ రెడ్డి దే బాధ్యత అని హెచ్చరించారు. చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో కుట్రలు పన్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఆయనకు తగిన భద్రత లేనందున ఆయన ఎంతో ప్రమాదంలో ఉన్నారన్నారు. దోమలు, కలుషిత నీరు, బరువు తగ్గడం, ఇన్‌ఫెక్షన్‌లు, అలర్జీలు ఉన్నా సకాలంలో వైద్య సహాయాన్ని అందించట్లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైద్య సాయం అందించడంలో ప్రభుత్వం విఫలం.. జైల్లో తన భర్తకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) ఆరోపించారు. తన భర్త క్షేమం గురించి తాను చాలా ఆందోళన చెందుతున్నానని ఆమె తెలిపారు. ఆయన ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారన్న ఆమె... ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెపుతున్నారని ఆవేదన చెందారు. జైల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని అన్నారు. ఈ భయంకరమైన పరిస్థితులు తన భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయని భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు.

Vijayawada ACB Court Approved CID PT Warrant: సోమవారం చంద్రబాబును వ్యక్తిగతంగా హాజరుపర్చండి: ఏసీబీ కోర్టు ఆదేశం

ప్రాణాలకు ముప్పు.. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్ప పొంచి ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి (Nara Brahmani) అన్నారు. చంద్రబాబుని అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించటం హృదయ విదారకమన్న ఆమె... ఇది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు క్షేమం గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేసినందున ఆయనకు తక్షణ వైద్య సహాయం అవసరమని తెలిపారు. చంద్రబాబుకు సకాలంలో వైద్యం అందడం లేదని అన్నారు. చంద్రబాబు 5 కిలోలు బరువు తగ్గడం ఆయన కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులమంతా తీవ్ర ఆందోళన చెందుతున్నామని నారా బ్రాహ్మణి అన్నారు.

జైలుకు పంపినా పగ చల్లారలేదా.. చంద్రబాబు ఆరోగ్యంతో జగన్ రెడ్డి చెలగాటమాడుతున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ దుయ్యబట్టారు. అభివృద్ధిలో చంద్రబాబుని ఎదుర్కోలేక అక్రమ కేసులతో జైలు పాల్జేసినా పగ చల్లారలేదా అని నిలదీశారు. 73 ఏళ్ల వయసులో పెద్దాయన్ను ఇబ్బంది పెడతారా అంటూ మండిపడ్డారు. తప్పుడు వైద్య నివేదికలతో ఎవరిని మభ్య పెడదామనుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబుకి వైద్యం అందించేందుకు వ్యక్తిగత వైద్యలను అనుమతించాలని డిమాండ్‌చేశారు. ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించాలని కోరారు. చంద్రబాబుకి ఏమైనా జరిగితే జగన్ రెడ్డిదే బాధ్యతని తేల్చిచెప్పారు.

తక్షణ సాయం అందించాలి.. చంద్రబాబుకు తక్షణమే వైద్యం అందించాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్యం అందించాలని, పూర్తి పరీక్షలు చేయడంతో పాటు సరైన వైద్యం అందించాలని కోరారు. ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

పార్టీ అత్యవసర సమావేశం.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలు అత్యవసర సమావేశమైన నాయకులు. చంద్రబాబుపై సీఐడీ కేసులు.. పరిణామాలపై సమీక్షిస్తున్నారు.

Nara Lokesh Fires on CM YS Jagan: అసలేం తప్పు చేశారు.. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప‌రుగులు పెట్టించినందుకే అరెస్టు చేశారా..

Last Updated : Oct 13, 2023, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.