ETV Bharat / bharat

36ఏళ్లుగా అంధకారంలోనే.. దశాబ్దాల తర్వాత ఇంట్లో వెలుగులు.. మంత్రి చొరవతో విద్యుత్ కనెక్షన్ - కోల్​కతా కుటుంబం విద్యుత్ కనెక్షన్

కోల్​కతాలో ఓ కుటుంబానికి 36 ఏళ్ల తర్వాత విద్యుత్ కనెక్షన్ అందింది. ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి.. ఆ కుటుంబం కష్టాలను తెలుసుకొని విద్యుత్ కనెక్షన్ ఇప్పించారు.

electricity connection after 36 years
electricity connection after 36 years
author img

By

Published : Jan 7, 2023, 7:04 PM IST

మూడు దశాబ్దాలుగా చీకట్లో మగ్గిన కుటుంబానికి ఊరట లభించింది. బంగాల్ కోల్​కతాలోని ఓ కుటుంబానికి 36ఏళ్లు తర్వాత విద్యుత్ కనెక్షన్ అందింది. బహ్రంపుర్​కు చెందిన సకీనా షేక్ కుటుంబం.. ఏళ్ల పాటు చీకట్లోనే గడిపింది. వీరంతా ఇన్నేళ్లుగా విద్యుత్ అవసరాల కోసం పక్కింటివారిపైనే ఆధారపడ్డారు ఈ కుటుంబ సభ్యులు. ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా.. టీవీ చూడాలన్నా.. పొరుగున ఉండేవారే ఆధారం. విద్యుత్ కనెక్షన్ కోసం అవసరమైన డబ్బు చెల్లించే స్తోమత సైతం లేదు.

అయితే, రాష్ట్రమంత్రి అరూప్ బిశ్వాస్ చొరవతో ఆ కుటుంబానికి విద్యుత్ సౌకర్యం అందింది. కొద్దిరోజుల క్రితం ఈ ప్రాంతంలో పర్యటించిన అరూప్ బిశ్వాస్.. సకినా పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ కాలంలోనూ విద్యుత్ కనెక్షన్ లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే కోల్​కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను రంగంలోకి దించారు. మంత్రి ఆదేశాల ప్రకారం.. చర్యలు చేపట్టిన అధికారులు వెంటనే సకీనా షేక్ ఇంటికి విద్యుత్ సదుపాయం కల్పించారు. కులాయి కనెక్షన్​ను సైతం అందించారు.

electricity connection after 36 years
సకీనా షేక్

"మేం ఇక్కడ 36ఏళ్లుగా ఉంటున్నాం. విద్యుత్ కనెక్షన్ కావాలంటే ఛార్జీలు చెల్లించాలి. అవి ఇచ్చే పరిస్థితుల్లో మేము లేము. సాయం అడగాలాన్నా.. మాకు ఎవరూ తెలియదు. కానీ ఇబ్బందులు తట్టుకోలేక స్థానిక కౌన్సిలర్​కు, ఎమ్మెల్యేకు మా బాధ చెప్పుకున్నాం. వారు మాకు సహాయం చేశారు. వారి వల్లే మా ఇంటికి వెలుగు వచ్చింది."
-సకీనా షేక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.