ETV Bharat / bharat

గోడ కూలి ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి, లారీ ఢీకొని మరో ఐదుగురు - ఛత్తీస్​గఢ్​ గోడ ప్రమాదం

రాజస్థాన్​ పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదయాత్రగా దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్​గఢ్​లో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 15, 2022, 1:44 PM IST

ఛత్తీస్​గఢ్​ కాంకేర్​ జిల్లాలో దారుణం జరిగింది. గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. పఖంజుర్​ పరిధిలోని ఇర్పానర్​ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. దీంతో దంపతులు సహా ముగ్గురు కుమార్తెలు విగతజీవులయ్యారు. మృతులంతా ఇంట్లో నిద్రిస్తుండగా.. వర్షానికి గోడ కూలి వారిపై పడిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. తాజాగా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కొట్టుకుపోవడం వల్ల పడవ సహాయంతో అధికారులు గ్రామానికి వెళ్లారు.
కాంకేర్​ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రోడ్డు మార్గాలు తెగిపోయాయి.

భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి: పాదయాత్రగా దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం రాజస్థాన్​లోని పాలి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్​ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

భిల్వారా జిల్లాలోని రాయ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఖేమ్నా గ్రామానికి చెందిన భక్తులు రామ్​దేవరకు పాదయాత్రగా బయలదేరారు. పాదయాత్ర ముకున్​పుర గ్రామానికి చేరుకున్న సమయంలో ఓ ట్రక్కు వెనుక నుంచి వచ్చి భక్తులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతిచెందారు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతులను పప్పు, గిర్​ధారి, పవన్​, సుశీల, పరాస్​గా గుర్తించారు. ఈ ప్రమాదంపై లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి: అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపు కాల్స్, వరుసగా ఎనిమిది సార్లు

మహిళపై అత్యాచారం చేసి, ప్రైవేటు భాగాల్లో కర్ర చొప్పించి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.